Friday, November 22, 2024

విమానంలో స్మోకింగ్.. విచారణకు ఆదేశించిన సింధియా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: స్పైస్‌జెట్ విమానంలో సిగరెట్ తాగుతున్న బాడీ బిల్డర్ బాబీ కటారియా వీడియో సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో దీనిపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గురువారం విచారణకు ఆదేశించారు. స్పైస్‌జెట్ విమానంలో వెనుక వరుసలోని సీటులో రిలాక్సింగ్‌గా వాలిన కటారియా లైటర్‌తో సిగరెట్ వెలిగిస్తున్నట్లు ఈ వీడియోలో కనిపించింది. విమానంలోకి ప్రయాణికులు లైటర్‌ను తీసుకెళ్లడం నిషిద్ధం. అలాగే విమానంలో స్మోకింగ్ చేయడం కూడా నిషిద్ధం. ఇన్‌స్టాగ్రామ్‌లో 6.3 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న కటారియా స్మోకింగ్ వీడియో సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపింది. ఈ సంఘటనపై స్పైస్‌జెట్ వివరణ ఇచ్చింది. ఈ ఏడాది జనవరి 20న దుబాయ్-ఢిల్లీ విమానంలో ఈ స్మోకింగ్ సంఘటన చోటుచేసుకుందని తెలిపింది. ప్రయాణికులు విమానంలోకి ప్రవేశిస్తున్న సమయంలో ఇది జరిగిందని, ఆ సమయంలో తమ సిబ్బంది ఆన్ బోర్డింగ్ విధులలో నిమగ్నమై ఉన్నారని స్పైస్‌జెట్ వివరించింది. గురువారం ఈ వీడియో ట్విట్టర్‌లో పోస్టు కాగా, దీనిపై స్పందించిన సింధియా అటువంటి ప్రమాదకర ప్రవర్తనను సహించేది లేదని, దీనిపై దర్యాప్తు జరుపుతామని ప్రకటించారు.

Scindia orders probe on viral video of smoking in flight

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News