Wednesday, January 22, 2025

విస్కీ ఐస్ క్రీముల గుట్టురట్టు

- Advertisement -
- Advertisement -

11.5 కేజీల విస్కీ ఐస్ క్రీమ్ స్వాధీనం

హైదరాబాద్:  అంటే ధరలతో అమ్మకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్న ఐస్ క్రీమ్ పార్లర్ ప్రబుద్ధుల తీరును ఎక్సైజ్ ఎన్ఫోర్్సమెంట్ పోలీసులు బయటపెట్టారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1వన్ అండ్ 5లో లో హరికే కేఫ్ ఐస్ క్రీమ్ పార్లర్ షాపులో విస్కీ ఐస్ క్రీమ్ అమ్మకాలు సాగిస్తున్నారు. ఒక కేజీ ఐస్ క్రీమ్ లో 60ఎంఎల్ 100 పేపర్ విస్కీ కలిపి అధిక ధరలకు అమ్మకాలు సాగిస్తున్నారు. మరో అడుగు ముందుకు వేసిన ఐస్ క్రీమ్ తయారీదారులు సోషల్ మీడియాలో ఒక యాడ్ కూడా ఇచ్చి తమ అమ్మకాల్ని జోరు అందుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ఆఫ్ కేజీ విస్కీ ఐస్ క్రీమ్ గల 23 పీసులు, 11.5 కేజీల విస్కీ ఐస్ క్రీములను ఎక్సైజ్ సూపరిండెంటెండ్ ఎస్ టి ఎఫ్ టీం లీడర్ ప్రదీప్ రావు బృందం స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. విస్కీతో ఐస్ క్రీమ్ న్లను తయారు చేసిన వ్యక్తుల్లో దయాకర్ రెడ్డి, శోభన్ లు ఉన్నారు. ఈ ఐస్ క్రీమ్ పార్లర్ ను శరత్ చంద్రారెడ్డి అనే వ్యక్తి నిర్వహిస్తున్నారు. ఈ విస్కీ ఐస్ క్రీమ్ ఆపరేషన్ లో బలరాం, ఎస్సై అరుణ్ మౌనిక, ప్రసన్న, యాదగిరిలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News