Friday, December 20, 2024

స్కూటీ ఫ్యాన్సీ నంబర్ కోసం రూ. 1.12 కోట్ల బిడ్

- Advertisement -
- Advertisement -

 

న్యూస్‌డెస్క్: ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ కోసం ఒక వ్యక్తి ఆన్‌లైన్ బిడ్డింగ్‌లో రూ. 1.12 కోట్లు బిడ్ చేశాడంటే నమ్ముతారా..అది కూడా ఒక స్కూటీ కోసం..హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా జిల్లా కోట్‌ఖై నగరంలో ఆర్‌టిఎ కార్యాలయానికి ఈ బిడ్ అందింది. హెచ్‌పి 99-9999 నంబర్ కోసం ఆర్‌టిఎ ఆఫీసు ఆన్‌లైన్ బిడ్డింగ్ ఆహ్వానించింది. బిడ్ రిజర్వ్ ధ్రర రూ.1,000 అని నిర్ణయించగా మొత్తం 26 మంది బిడ్ కోసం దరఖాస్తు చేసుకున్నారని రవాణా శాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం ముగియనున్న బిడ్డింగ్ గడువులో ఇప్పటివరకు అత్యధిక బిడ్ రూ.1,12,15,500 వచ్చిందని వారు చెప్పారు.

కాగా..బిడ్ వేసిన వ్యక్తి వివరాలు బయటకురాలేదు. ఆ వ్యక్తికే బిడ్ దక్కిన పక్షంలో సదరు వ్యక్తి డబ్బును డిపాజిట్ చేయకపోతే రెండవ బిడ్డర్‌కు ఆ నంబర్ దక్కుతుంది. స్కూటీ ఖరీదు రూ.70,000 నుంచి రూ.1,80,000 మధ్యనే ఉండగా ఫ్యాన్సీ నంబర్ కోసం కోటి రూపాయలకు పైగా వెచ్చించడానికి ఒక వ్యక్తి పోటీపడడం రవాణా శాఖ అధికారులను సైతం విస్మయపరుస్తోంది. కొండ ప్రాంతాలలో అనువైన ప్రయాణానికి స్కూటీ బాగా ఉపయోగపడుతున్నట్లు సమాచారం. ఇటీవలి కాలంలో స్కూటీ అమ్మకాలు హిమాచల్ ప్రదేశ్‌లో బాగా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News