Saturday, December 28, 2024

పెళ్లికి వెళ్లి తిరిగొస్తూ.. రోడ్డు ప్రమాదంలో నలుగురు డాక్టర్లు మృతి

- Advertisement -
- Advertisement -

ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. కాగా ఒకరు గాయపడ్డారు. కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి అటువైపు ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సైఫాయి మెడికల్ యూనివర్శిటీకి చెందిన నలుగురు డాక్టర్లు సహా ఐదుగురు మృతి చెందారు.

ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌హైవేపై తెల్లవారుజామున 3.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుడిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వారంతా లక్నోలో ఓ వివాహ వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా.. వారు ప్రయాణిస్తున్న స్కార్పియో డివైడర్ ను ఢీకొట్టిందని.. డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News