Sunday, January 19, 2025

జింబాబ్వేకు స్కాట్లాండ్ షాక్

- Advertisement -
- Advertisement -

బులవాయో: ప్రపంచకప్ క్వాలిఫయర్స్ టోర్నమెంట్‌లో మంగళవారం పెను సంచలనం నమోదైంది. జింబాబ్వేతో జరిగిన సూపర్ సిక్సెస్ మ్యాచ్‌లో స్కాట్లాండ్ 31 పరుగుల తేడాతో ఆతిథ్య జింబాబ్వేపై సంచలన విజయం సాధించింది. ఈ గెలుపుతో స్కాట్లాండ్ ప్రపంచకప్ బెర్త్‌కు చేరువ కాగా జింబాబ్వే రేసు నుంచి దాదాపు వైదొలిగింది. జింబాబ్వేపై చారిత్రక విజయం సాధించిన స్కాట్లాండ్ ఫైనల్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది.

తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 234 పరుగులు సాధించింది. ఓపెనర్లు మెక్‌బ్రైడ్ (28), మాథ్యూ క్రాస్ (38) శుభారంభం అందించారు. మెక్‌ముల్లెన్ (34), మున్సె (31) కూడా మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచారు. ఇక మైఖేల్ లీస్క్ 34 బంతుల్లోనే 48 పరుగులు సాధించాడు. మార్క్ వాట్ 21 (నాటౌట్) తనవంతు పాత్ర పోషించడంతో స్కాట్లాండ్ స్కోరు 234 పరుగులకు చేరింది.

తర్వాత బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 41.1 ఓవర్లలో కేవలం 203 పరుగులకే కుప్పకూలింది. రియాన్ బుర్ల్ (83), వెస్లీ మధెవర్ (40), సికందర్ రజా (34) రాణించినా ఫలితం లేకుండా పోయింది. క్రిస్ సోల్ మూడు, మెక్‌ముల్లెన్, మైఖేల్ లీస్క్ రెండేసి వికెట్లను పడగొట్టి స్కాట్లాండ్‌కు అద్భుత విజయం సాధించి పెట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News