విశాఖపట్నం, విజయవాడ మార్గంలో పలు రైళ్ల రద్దు
హైదరాబాద్: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలర్ట్‌ను జారీ చేసింది. విశాఖపట్నం, విజయవాడ మార్గంలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. విజయవాడ డివిజన్‌లో భద్రతాపరమైన ఆధునికీకరణ పనులు చేపడుతున్న నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్ని రైళ్లను దారి మళ్లీంచినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు పలు రైళ్లను దారి మళ్లీంచడంతో పాటు కొన్నింటిని రద్దు చేస్తున్నట్లు వాల్తేరు సీనియర్ డిసిఎం ఏకే త్రిపాఠి తెలిపారు.
గుంటూరు, -విశాఖ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 17239)ను 17వ తేదీ వరకు రద్దు చేసింది. రైలు నంబర్ 17240 విశాఖ-, గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ను 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. కాకినాడ, విశాఖపట్నం, – కాకినాడ (రైలు నం. 17267-17268) ఎక్స్‌ప్రెస్‌ను 10వ తేదీ నుంచి నుంచి 16వ తేదీ రద్దు చేయగా, రాజమహేంద్రవరం-, విశాఖ-, రాజమహేంద్రవరం (ట్రైన్ నంబర్ 17239) ఈ నెల 10 నుంచి 16వ తేదీ వరకు రద్దు చేసినట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 11, 14, 15 తేదీల్లో ధన్బాద్-, అళప్పుజ (రైలు నం.13351), 11న హటియా -ఎస్‌ఎంవి బెంగళూరు (రైలు నంబర్ 12835), 14న టాటానగర్, -ఎస్‌ఎంవి బెంగళూరు (రైలు నంబర్ 12889), 15న హటియా-, ఎస్‌ఎంవి బెంగళూరు (రైలు నంబర్ 18637) రైళ్లను వయా నిడదవోలు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ మీదుగా దారి మళ్లీంచినట్లు అధికారులు వివరించారు.