Friday, December 20, 2024

ఈ నెల 25 నుంచి జూలై 3వ తేదీ వరకు 36 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ట్రాక్ మరమ్మతులు, నిర్వహణ పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే 36 రైళ్లను రద్దుచేసింది. నేటి నుంచి జూలై 3వ తేదీ వరకు ఈ రైళ్లను రద్దు చేసినట్లు తెలిపింది. వీటిలో కొన్ని రైళ్లు ఒక్కోరోజు, మరికొన్ని అన్ని రోజులు రద్దుచేసినట్లు అధికారులు వెల్లడించారు. మేడ్చల్-, సికింద్రాబాద్‌ల మధ్య నడిచే రైళ్లను జూన్ 25, 26 తేదీల్లో, కాచిగూడ నుంచి రాయచూర్, మహబూబ్‌నగర్ వెళ్లే రైళ్లను జూన్ 26 (సోమవారం) రద్దు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఎంఎంటిఎస్ రైళ్లు సైతం రద్దు

కరీంనగర్ నుంచి నిజామాబాద్, సిర్పూరు టౌన్‌ల మధ్య నడిచే రైళ్లను జూన్ 26 నుంచి జూలై 3వ తేదీ వరకు, కాజీపేట నుంచి డోర్నకల్, భద్రాచలం, -విజయవాడ, సికింద్రాబాద్ నుంచి వికారాబాద్, వరంగల్ ప్యాసింజర్ రైళ్లను ఈ నెల 26 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. వీటితో పాటు హైదరాబాద్- , లింగంపల్లి-, చందానగర్, -ఫలక్‌నుమా, -రామచంద్రాపురంల మధ్య తిరిగే ఎంఎంటిఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

రైళ్ల వివరాలు ఇలా…

కాజీపేట- టు డోర్నకల్, డోర్నకల్ టు -కాజీపేట, డోర్నకల్- టు విజయవాడ-, డోర్నకల్, భద్రాచలం- టు విజయవాడ- భద్రాచలం టు సికింద్రాబాద్-వికారాబాద్- టు సికింద్రాబాద్, సికింద్రాబాద్- టు వరంగల్, వరంగల్- టు హైదరాబాద్, సిర్పూర్ టౌన్ టు -కరీంనగర్ టు -సిర్పూర్ టౌన్, కరీంనగర్- టు నిజామాబాద్- టు కరీంనగర్, కాజీపేట- టు సిర్పూర్ టౌన్, బళ్లార్షా- టు కాజీపేట టు -బళ్లార్ష, భద్రాచలం టు -బళ్లార్ష, సిర్పూర్ టౌన్- టు భద్రాచలం, కాచిగూడ- టు మహబూబ్‌నగర్- టు కాచిగూడ, కాచిగూడ టు -రాయచూరు, రాయచూర్- టు గద్వాల టు -రాయచూర్, రాయచూర్- టు కాచిగూడ, సికింద్రాబాద్- టు మేడ్చల్- టు సికింద్రాబాద్ రైళ్లతో పాటు వేరే రైళ్లు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News