Monday, January 20, 2025

148 త్రీ ఫేజ్ విద్యుత్ లోకో మోటివ్‌లను ప్రారంభించిన దమ రైల్వే

- Advertisement -
- Advertisement -

దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో గత ఆర్థిక సంవత్సరంలొ అత్యధికంగా 148 సరికొత్త త్రీ ఫేజ్ విధ్యుత్ లోకోమోటివ్ లను ప్రారంభించింది. ఇది 2022 -23 సంవత్సరంలో ప్రారంభించబడిన 103 త్రీ ఫేజ్ విధ్యుత్ లోకోమోటివ్‌లతో పోల్చితే 45 శాతం ఎక్కువ అని దక్షిణ మధ్య రైల్వే వర్గాలు శుక్రవారం తెలిపాయి. ఈ లోకోలు అధిక హార్స్ పవర్ తో ఎటువంటి ఆటంకం లేకుండా గంటకు 130 కిలోమీటర్ వేగంతో పూర్తి-నిడివి గల 22 ఎల్.ఎచ్.బి. కోచ్ ప్యాసింజర్ రైలును సులభంగా నడిపించగలవు. ఇంతేకాకుండా ఈ లోకోమోటివ్లు సరుకు రవాణా కోసం కూడా సమతుల్య మైన వేగాన్ని అందిస్తూ సరుకు తరలింపులో రవాణా సమయాన్ని ఆదాచేస్తాయి. మిషన్ విద్యుదీకరణ దిశలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే జోన్ అంతటా రైలు మార్గాల విద్యుద్దీకరణను భారీగా విస్తరించినట్లు తెలిపింది.

ముఖ్యంగా నెట్వర్క్ పరిధి విస్తరణ కోసం ఇటీవల నిర్మించిన కొత్త రైల్వే లైన్లు , పూర్తిగా, పాక్షికంగా నిర్మాణంలో ఉన్న లైన్లు మినహా అన్ని ట్రాఫిక్ రన్నింగ్ రూట్లు ఇప్పుడు విద్యుదీకరించబడ్డాయని వెల్లడించింది. అందులో భాగంగానే 3 -ఫేజ్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ల సంఖ్య పెంచినట్లు పేర్కొంది. తద్వారా ప్రయాణీకుల ట్రాఫిక్ అవసరాలను తీర్చడంలో దోహదపడుతుందని వెల్లడించింది. 3- ఫేజ్ లోకోమోటివ్‌లలో పర్యావరణ హిత అంశం కావడం ద్వారా దీనివలన కార్బన్ ఉద్గారలను తగ్గించడమే కాకుండా 12.4 శాతం విద్యుత్ శక్తిని కూడా ఆదా చేస్తుంది. ఇవి అధిక సగటు వేగంతో నడుస్తూ భారీ రైళ్లను నడిపించగలవు అని దమ రైల్వే అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News