Saturday, November 16, 2024

తుక్కు దందా కాసుల వరద

- Advertisement -
- Advertisement -

ఫైనాన్షియర్‌లు, దళారులతో రవాణాశాఖ అధికారుల కుమ్మక్కు !
ఆటోను తుక్కుగా మార్చకున్నా ప్రొసీడింగ్

మళ్లీ అదే ఆటో వేరే జిల్లాలో విక్రయం

(ఎల్.వెంకటేశం)
ఆటోల స్క్రాప్ (తుక్కు) అధికారులకు కనకవర్షం కురిపిస్తోంది. కొందరు రవాణాశాఖ అధికారులు ఫైనాన్షియర్‌లు, దళారులతో కలిపి ఈ స్క్రాప్ దందాలో పాలుపంచుకొని తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రేటర్‌లో వాహన కాలుష్యం దృష్ట్యా కొత్త ఆటోల రిజిస్ట్రేష న్లు రద్దు చేసిన నేపథ్యంలో పాత ఆటోలను తుక్కుకింద మార్చి వాటి స్థానంలో కొత్తవాటికి అనుమతిస్తున్నారు. దీనికి సంబంధించి రవాణాశాఖ అధికారులు ప్రొసీడింగ్ ఇవ్వాల్సి ఉంటుం ది. ఈ ప్రొసీడింగ్‌ను డీలర్‌కు చూపిస్తే వారు కొత్త ఆటోలను ఇస్తారు. అయి తే ఈ ప్రొసీడింగ్ ఇచ్చే విషయంలో రవాణా శాఖ అధికారులు డీలర్‌లతో పాటు దళారులతో కుమ్మక్కై ఈ దందా ను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
వీడియో, ఫొటోలు తీయకుండా..
పాత ఆటోను స్క్రాప్‌కు తీసుకొచ్చినప్పుడు యం త్రంతో ఆ ఆటోను నాలుగు ముక్కలుగా చేయాల న్న నిబంధనలు ఉన్నాయి. అనంతరం ఆటో ఛాసి స్ నెంబర్ ఆధారంగా ఆ ఆటోను స్క్రాప్ కింద మార్చినట్టు రవాణా శాఖ అధికారులు ప్రొసీడింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సమయంలోనే రవాణా శాఖ అధికారులు ఈ తతంగాన్ని వీడియో, ఫొటోలు తీయకుండా, ఆటోను స్క్రాప్ చేయకుండానే చేసినట్టుగా వారికి ప్రొసీడింగ్ ఇచ్చి వారి నుంచి లంచాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు వె ల్లువెత్తుతున్నాయి. అయితే ఈ ఆటో ను ఈ వాహనాల యజమానులు వేరే జిల్లాలో రూ.30 నుంచి రూ.50 వేలకు అమ్ముకుంటున్నారు. అయితే ఇదే అదునుగా రవాణాశాఖ కార్యాలయాల్లో పాత ఆటోల స్థానంలో కొత్తవాటికి రూ.లక్షలు తీసుకొని అనుమతులిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఒక్కో ఆటోకు రూ.3 నుంచి -రూ.4లక్షల వర కు డిమాండ్ చేస్తున్నారు. పలు రవాణాశాఖ కార్యాయాల్లో ఈ అక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయ ని ఆటో యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు.
గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం ఆటో ధర రూ. 5 లక్షల 50 వేలు
సాధారణంగా వాహనాల ధరలు రాష్ట్రంలో ఏ ప్రాం తంలోనైనా ఒకే ధర ఉంటాయి. కానీ, ఇందుకు భి న్నంగా గ్రేటర్ హైదరాబాద్‌లో కొనుగోలు ఆటోల ధరల విషయంలో లక్షల్లో తేడా ఉంటుంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ ఆటోల కొనుగోళ్లపై నిషేధం ఉండడంతో రవాణా శాఖ అధికారులతో పాటు డీలర్లు, ఫైనాన్షియర్‌లకు ఇది ఒక వరంగా మారింది. వేరే జిల్లాలో కొత్త ఆటో ఖరీదు సుమారు రూ. 2.50 లక్షలు ఉండగా అదే ఆటోను హైదరాబాద్ పరిధిలో కోనుగోలు చేయాలంటే రూ. 5 లక్షల 60 వేలను ఖర్చుచేయాల్సి వస్తోంది. ఆటోలను బ్లాక్ మార్కెట్లో కోనుగోలు చేయాల్సి రావడంతో ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని ఆటోయూనియన్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పర్మిట్ కోసమే పెద్ద మొత్తంలో …
2002లో కేంద్ర ప్రభుత్వ నియమించిన బూరేలాల్ కమిటీ ఈ ఆటోలను నిషేధించడంతో ఈ దందాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. కొత్త ఆటోల కొ నుగోళ్లకు ప్రభుత్వం నుంచి అనుమతి లేక పోవడం తో ఆటోలను కొనుగోలు చేయాలనుకునే వారి పర్మి ట్ పేరుతో రూ. 2.50 లక్షల వరకు అదనంగా చెల్లించాల్సి వస్తుందని ఆటోడ్రైవర్ యూనియన్ నాయకు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఆటో పర్మిట్ ఉంటే కొత్త ఆటోలను కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది.
ఈ నేపథ్యంలో కాలం చెల్లిన ఆటో స్క్రాప్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా స్క్రాప్ చేసిన ఆటోలకు సంబంధించిన వివరాలతో కొత్త ఆ టోలకు అనుమతి (పర్మిట్ ) పొందాల్సి ఉంటుంది. ఈ విధంగా పర్మిట్ కోసమే పెద్ద మొత్తంలో సమర్పించాల్సి వస్తోందని ఆటోడ్రైవర్ యూనియన్ నాయకు లు వాపోతున్నారు. ఇక షోరూంల్లో ఆటో రిక్షా ధర రూ.2 లక్షల 50 వేలు ఉంటే ఎవరైనా కొత్తగా ఆటో రిక్షా కొనుగోలు కోసం వెళితే పర్మిట్‌తో కలిపి ఒక్క ఆ టోకు రూ.5 లక్షలకు పైగానే చెల్లించాల్సి వస్తుందని ఆటోల యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు నిబంధనలు పాటించడం లేదు
ఆటోల స్క్రాప్ (తుక్కు) విషయంలో ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలను అధికారులు పాటించడం లేదని తెలంగాణ ర వాణరంగ కార్మికుల ఐక్యసమితి జేఏసీ కన్వీనర్ దయానంద్ తెపా రు. స్క్రాప్ జరిగేటప్పుడు వీడియో, ఫొటోలను తీ యడం లేదు. 2012 తరువాత కొత్త ఆటోల కొనుగోళ్లపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. దీనిని అధికారులు ఆసరాగా చేసుకొని ఈ దందాను కొనసాగిస్తున్నారు. 2002లో 68 వేల ఆటోలు ఉం టే ప్రస్తుతం లక్ష పైచిలుకు ఆటోలు గ్రేటర్ రోడ్లపై తి రుగుతున్నాయి. కొత్త ఆటోలకు అనుమతులు ఇవ్వకున్నా రోడ్లపైకి కొత్త ఆటోలు వస్తున్నాయన్న దాని పై రవాణా శాఖ ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టి సారించాలి. జిల్లాల నుంచి కొందరు ఆటోలు తీసుకొ చ్చి గ్రేటర్ పరిధిలో నడుపుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు, ఈ విషయమై ప్రభుత్వం విచారణ జరిపించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News