Thursday, January 23, 2025

విద్యార్థుల్లో జాతీయ భావం పెంపొందించేందుకే గాంధీ చిత్ర ప్రదర్శన

- Advertisement -
- Advertisement -
  • జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా

భూపాలపల్లి కలెక్టరేట్: విద్యార్థుల్లో జాతీయ భావం పెంపొందించేందుకే రాష్ట్ర ప్రభుత్వం గాంధీ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించిందని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాలలో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలకు చెందిన విద్యార్థిని, విద్యార్థుల కోసం జిల్లా కేంద్రంలోని 2, గణపురంలోని 1 థియేటర్‌లలో గాంధీ చిత్రాన్ని ఉచితంగా ఆగష్టు 14 నుండి 24 వరకు ప్రదర్శించగా 6850 మంది విద్యార్థులు గాంధీ చిత్రాన్ని తిలకించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.

థియేటర్ల నిర్వాహాకులు, విద్యాశాఖ, సమాచార శాఖ సంబంధాల శాఖ పోలీస్‌శాఖల అధికారులు సమన్వయంతో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా చిత్ర ప్రదర్శన నిర్వహించడం జరిగిందని, ఈ చిత్ర ప్రదర్శన విజయవంతంగా నిర్వహించడం జరిగిందని ప్రకటనలో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News