Thursday, January 23, 2025

తొమ్మిది రోజులుగా సర్టిఫికెట్ల పరిశీలన

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి  : తొమ్మిది రోజులుగా ఎస్ ఐ,కానిస్టేబుల్ అభ్యర్థుల ధృవ పత్రాల పరిశీలన సంగారెడ్డిలో జరుగు తోంది. ఉన్నతాధికారల ఆదేశాల మేరకు ఈ ప్రక్రియను ఎలాంటి సమ స్యలు తలెత్తకుండా పోలీస్ శాఖ కొనసాగిస్తోంది. తొమ్మిదో రోజయిన శుక్రవారం కూడా సర్టిఫికెట్ల పరిశీలన ప్రశాంతంగా జరిగింది. సంగారెడ్డిలోని పోలీస్ కళ్యాణ మండపంలో 731 మంది అభ్యర్థులకు గాను 664 మంది హాజరయ్యారని జిల్లా అదనపు ఎస్‌పి ఉషా విశ్వనాథ్ తెలిపారు. ధృవ పత్రాల పరిశీలనకు హాజరవుతున్న వికారాబాద్, సంగా రెడ్డి,మెదక్,జిల్లాలకు చెందిన అభ్యర్థులు..తమ వెంట వెరిఫికేషన్ లెట ర్‌తో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లు ,వాటి జిరాక్స్ కాపీలు తేవాలని అదనపు ఎస్‌పి చెప్పారు. సర్టిఫికెట్ల పరిశీలన కారణంగా పోలీస్ కళ్యాణ మండపం ప్రాంగణం వద్దకు అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి సాంకేతిక సమస్యలు కాని, అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా పోలీస్ అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News