Wednesday, January 22, 2025

ముగిసిన ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన

- Advertisement -
- Advertisement -

గద్వాల: జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల ఎస్‌ఐ, కానిస్టేబుల్ స్థాయి పరీక్షలలో అర్హత సాధించిన అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన జిల్లా పోలీస్ కార్యాలయంలో నేటితో ముగిసిందని జిల్లా ఎస్పీ కె. సృజన తెలిపారు. రెండు జిల్లాలకు సంబంధించి 4967 మంది అభ్యర్థులకు 4405 మంది అభ్యర్థులు హాజరైనట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్న కార్యాలయం సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సాయుధ దళ డిఎస్పీ ఇమ్మనీయోల్ , కార్యాలయం ఏఓ సతీష్‌కుమార్, సూపరింటెండెంట్స్ నయీం, ఇంతియాజ్ , ఇతర సిబ్బంది , ఐటి కోర్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News