Monday, December 23, 2024

రేపటి నుంచి పోలీస్ అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన

- Advertisement -
- Advertisement -

గద్వాల: ఎస్‌ఐ, కానిస్టేబుల్ స్థాయి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భా గంగా తుది రాత పరీక్షలో అర్హత సాధించిన జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాలకు చెందిన వారి ధృవపత్రాలను రేపటి నుంచి ఈ నెల 24 తేదీ వరకు 4967 మంది అభ్యర్థుల వెరిఫికేషన్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఓ సతీష్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం పరిశీలించడం జరుగుతోందని జిల్లా ఎస్పీ కె. సృజన తెలిపారు.
వెరిఫికేషన్‌కు వచ్చే అభ్యర్థులకు సూచనలు …..
అభ్యర్థులకు కేటాయించిన తేదీన ఉదయం 9 గంటలకు జిల్లా పోలీస్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మహిళా అభ్యర్థులు ఉదయం 8 గంటలకే జిల్లా పోలీస్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలి. మండలి వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న ఇంటిమేషన్ లేటర్‌ను తప్పనిసరిగా చూపించా లి. దరఖాస్తు వివరాల్లో సవరణలు అవసరం లేని అభ్యర్థులు నేరుగా పత్రాల పరిశీలన చేసుకోవచ్చు. ఒక వేళ సవరణ కోసం ఇప్పటికే ఆన్‌లైన్‌లో అర్జీ పెట్టుకొని ఉంటే ఆ పత్రాన్ని తప్పనిసరిగా వెంట తె చ్చుకోవాలి. అభ్యర్థి సమక్షంలోనే ఆ సవరణలను అధికారులు ఆమోదిస్తారు. అభ్యర్థులు డ్రైవింగ్‌కు సంబంధించిన పత్రాలు వెంట తెచ్చుకోవాలి. అభ్యర్థులు ఒరిజనల్ ధృవీకరణ పత్రాలతో పాటు ఫొటో కాపీలను తీసుకురావాలి. వాటిని పరిశీలించిన అనంతరం వచ్చే అర్హత పత్రంలో సంతకం చేయడంతో ప్రక్రియ పూర్తి అవుతుంది.

రేపటి నుంచి రోజు వారీగా హాజరయ్యే అభ్యర్థులు వివరాలు ….
జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాలకు సంబంధించి 14వ తేదీన 500 మంది, 15వ తేదీన 500 మంది, 16న 600, 17న 600, 19న 500, 20న 500, 21న 500 , 22న 500, 23న 500, 24న 267 మంది హాజరు కానున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News