- Advertisement -
జనగామటౌన్ : జనగామ పట్టణం వడ్లకొండ రోడ్డులో ఇరిగేషన్ క్వార్టర్స్‌లోని జిల్లా ఎక్సైజ్‌శాఖ కార్యాలయంలో జరుగుతున్న మద్యం టెండర్ల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను జనగామ జిల్లా కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య శుక్రవారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 47 మద్యం దుకాణాలకు గాను ప్రభుత్వ నిబంధనల మేరకు దరఖాస్తు స్వీకరణ జరుగుతుందన్నారు. ఈ దరఖాస్తుల స్వీకరణ ఈనెల 18వ తేదీ వరకు కొనసాగుతుందని, 21వ తేదీన డ్రా నిర్వహించి లబ్దిదారులను ఎంపిక చేయనున్నట్లు, ఇప్పటివరకు 60 దరఖాస్తులు వచ్చాయని ఆయన తెలిపారు. చివరి రోజు దరఖాస్తుల స్వీకరణ సమయంలో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కుర్చీలు, టెంట్లు, క్యూలైన్లు, తాగునీరు తదితర ఏర్పాట్లు చేయాలని ఎక్సైజ్‌శాఖ జిల్లా అధికారిణి కృష్ణప్రియను ఆదేశించారు.
- Advertisement -