Saturday, April 5, 2025

ప్రధాని పర్యటన ఏర్పాట్ల పరిశీలన

- Advertisement -
- Advertisement -

మేడ్చల్ జిల్లా: ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 8న వరంగల్ పర్యటన నేపథ్యంలో హకీంపేట విమానాశ్రయంలో ఏర్పాట్లను శుక్రవారం జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్ పరిశీలించారు. ప్రధాని పర్యటనకు సంబంధించి చేసిన ఏర్పాట్లను అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భం గా కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు.

అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ ప్రోటోకాల్ నిబంధనలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్య లు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ నరసింహారెడ్డి, ఆర్డీవో మల్లయ్య, అర్‌అండ్‌బి ఈఈ శ్రీనివాసమూర్తి, తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News