Wednesday, January 22, 2025

ఓట్ల కోసమే స్మార్ట్ సిటీ పనుల పరిశీలన

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ : కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కుమార్ ఓట్ల దగ్గర పడుతున్నాయని, ఓట్ల కోసమే నగరంలోని టవర్ సర్కిల్ వద్ద స్మార్ట్ సిటీ పనులు పరిశీలించారని రాష్ట్ర సివిల్ సప్లయి కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ ఆరోపించారు. సోమవారం ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ ఎంపీగా గెలిచిన నాలుగు సంవత్సరాల తర్వాత స్మార్ట్ సిటీ పనులు ఆయనకు గుర్తుకొచ్చాయా..అని విమర్శించారు.

ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయని బండి సంజయ్ స్మార్ట్ సిటీ పనుల బాట పట్టారని మండి పడ్డారు. స్మార్ట్ సిటీ పనులు జరుగుతున్న ఇన్ని రోజులు ఎందుకు బండి సంజయ్ ఎందుకు సందర్శించా లేదని ప్రశ్నించారు. పార్లమెంట్ సభ్యుడు హోదాలో స్మార్ట్ సిటీ పనుల విషయంలో ఎక్కడ కూడ రివ్యూలు తీసుకున్న దాఖలాలు లేవన్నా రు. టవర్ సర్కిల్ వ్యాపారులు వారికి ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా తీసుకున్న చర్యలు మాత్రం శూన్యం అన్నారు.

స్మార్ట్ సిటీ అడ్వైజరీ కమిటీ చైర్మన్‌గా బండి సంజయ్ పూర్తిగా విఫలం చెందారని అన్నారు. అడ్వైజర్ కమిటీ చైర్మన్‌గా హోదాలో బండి సంజయ్ ఒక్క సమా వేశం కూడ నిర్వహించలేదని, ఎండిగా నగరపాలక సంస్థ కమిషనర్ , అడ్వయిజరీ కమిటీ చైర్మన్ గా వీరిద్దరు కూడ కుమ్మక్కై స్మార్ట్ సి టీ పనులను గాలికి వదిలేశారన్నారు.

ఓట్ల ,కోట్ల కోసం మాత్రమే బండి సంజయ్ టవర్ సర్కిల్ లో స్మార్ట్ సిటీ పనులు జరుగుతున్న ఏరి యాలను సందర్శించారన్నారు. స్మార్ట్ సిటీ జాబితాలో కరీంనగర్ నగరాన్ని చేర్చడం కోసం అప్పుడున్న పార్లమెంట్ సభ్యులు బోయిన పల్లి వినోద్ కుమార్ అదేవిధంగా మేయర్ గా నేను నగర ప్రజలందరినీ కలుపుకొని తీవ్ర ప్రయత్నం చేసి స్మార్ట్ సిటీని సాధించుకున్నాం అని గుర్తు చేశారు.

ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వస్తున్న సందర్భంలో బండి సంజయ్ ని ప్రజలు ఎలాగో నమ్మరని డివిజన్ సందర్శన అని అభివృద్ధి పనులని నయా నాటకాలకు బండి సంజయ్ తెరలెపరన్నారు. రానున్న ఎన్నికలలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ జండా ఎగరడం ఖాయమని అన్నారు. అనంతరం నగరంలోని 51 డివిజన్‌లో డ్రైనేజీ నుండి మురికి నీరు రోడ్డు పైకి రావడా న్ని పరిశీలించడం జరిగించారు. ఆయన వెంట టిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, జిల్లా నాయకులు పెండ్యా ల మహేష్, కేమసారం తిరుపతి తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News