Thursday, January 23, 2025

అడవిలో అరుదైన శిల్పసంపద

- Advertisement -
- Advertisement -

నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రానికి సుమారు 30 కి.మీ దూరంలో సారంగాపూర్ మండలంలోని వైకుంఠపూర్ గ్రామ అటవీప్రాంతంలో అరుదైన అపురూప శిల్పసంపదను గుర్తించినట్లు ప్రముఖ కవి చరిత్ర పరిశోధకుడు డాక్టర్ తుమ్మల దేవరావ్ తెలిపారు. చాళుక్యుల కాలంలో ఈ ప్రాంతంలో ఆలయాలు ఉండేవని కాలక్రమంలో శిథిలమవగా గ్రామస్తులు కొండపై నూతన శివలయాన్ని నిర్మించి విగ్రహాలను భద్రపరిచారని తెలిపారు. ఇవి 7వ శతాబ్దానికి చెందిన చాళుక్యుల కాలం నాటివాని గుర్తించారు. 5 ఫీట్ల ఎత్తు కల్గిన ద్వారపాలకుల విగ్రహాలు నంది విగ్రహం భృంగి వీరభద్రుడు మహేశమూర్తి గణేశుడు శివలింగం తదితర విగ్రహాలను గుర్తించినట్లు తెలిపారు.

ఇదే కాకుండా లెష్మిదేవి సహిత విష్ణుమూర్తి శిథిల మైంది ఈ ప్రాంతంలో గుర్తించినట్లు తుమ్మలదేవరావ్ తెలిపారు. ఈ ప్రాంతము లోనే అరుదైన విష్ణ భక్తులయినా ఆళ్వారుల విగ్రహాలు ఉన్నాయి. తమిలవేదానికి లేదా ద్రవిడ వేదానికి ఆద్యులైన తొలి ఆరుగురు ఆళ్వారుల విగ్రహాలను గుర్తించినట్లు తెలిపారు. మొదటిసారి నిర్మల్ జిల్లాలో ఆళ్వారుల విగ్రహాలు వెలుగులోకి వచ్చాయని అన్నారు. విగ్రహపు పీఠభాగంలో తొలి తెలుగు కాలం నాటిలిపిలో ఆళ్వారుల పేర్లు రాయబడ్డాయని అన్నారు. పెరియాళ్వారు పేయాళ్వరు పోయగెళి, తిరుమంగై పూజత్త ఆళ్వార్ పేర్లు చెక్కబడినట్లు గుర్తించామని తుమ్మల దేవరావ్ తెలిపారు. ప్రాచీన శివాలయం తోపాటు వైష్ణవ భక్తుల విగ్రహాలు లక్ష్మీ సమేత విష్ణుమూర్తి విగ్రహాలు ఉండడం ఈ ప్రాంతానికి ప్రత్యేకత సంతరించుకుంది అని తెలిపారు.

చుట్టురా కొండలు లోయలతో ఈ ప్రాంతం ప్రకృతి సౌందర్యంతో అలరారు తుందని తెలంగాణ ప్రభుత్వం ఆలయాన్ని అభివృద్ధి చేయడంతో ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. ఈ పరిశోధనలో ప్రముఖ కవి అబ్బడి రాజేశ్వర్ రెడ్డితో కలిసి చేసినట్లు తుమ్మల దేవరావ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News