Friday, January 24, 2025

తెలంగాణలో పెద్ద ద్వారపాల శిల్పం

- Advertisement -
- Advertisement -

మల్యాలలో అతిపెద్ద ద్వారపాలక శిల్పం!
అపురూపశిల్పానికి ఆదరణ కరువు
సిద్ధిపేట జిల్లాలో వెయ్యేళ్ల శిల్పం
వెయ్యేళ్ల ద్వారపాలక శిల్పాన్ని కాపాడుకోవాలి!
పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి

హైదరాబాద్: సిద్ధిపేట జిల్లా నారాయణరావుపేట మండలం, మల్యాల పొలాల్లో తెలంగాణా రాష్ట్రంలోకె అతిపెద్ద ద్వారాపాలక శిల్పం, అలనాపాలనా లేక, ఎండకు ఎండుతూ వానకు తడుస్తుందని, వెయ్యేళ్లనాటి ఈ అపురూప శిల్పాన్ని కాపాడుకోవాలని, పురావస్తు పరిశోధకుడు ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌, సిఇఒ డా. ఈమని శివనాగిరెడ్డి తెలిపారు.
శ్రీరామోజుహరగోపాల్‌ నేతృత్వంలోని కొత్త తెలంగాణా చరిత్ర బృందం సభ్యులు అహోబలం కరుణాకర్‌, మహమ్మద్‌ నసీరుద్దీన్‌ ఇచ్చిన సమాచారం మేరకు ఆయన, వారితో కలిసి, ఆదివారంనాడు ఆ విగ్రహాన్ని పరిశీలించారు.
పంటపొలాల్లో, భూమిపైన 6-0 అడుగులు, భూమిలోపల 3-0 అడుగులు, 9 అంగుళాల మందంతో, గ్రానైటు రాతిలో చెక్కిన ఈ ద్వారపాలక విష్ణుద్వార పాలకుడైన విజయునిదని, కుడి చేతిలో గద, ఎడమ చేయిని సూచీ ముద్రగాను, పై రెండు చేతుల్లో శంఖు, చక్రాలను, తలపైన కిరీటమకుటాన్ని ఆభరణాలను, నడుము కింద వస్త్రాన్ని ధరించి ఉన్నాడని చెప్పారు. శిల్పకళ, ప్రతిమా లక్షణాన్ని బట్టి ఈ శిల్పం, రాష్ట్రకూట అనంతర, కళ్యాణ చాళుక్య తొలి కాలానికి అంటే క్రీ.శ.10వ శతాబ్దికి చెందిందనీ, ఇంతకు ముందు ములుగు ఘన్‌పూర్‌లో బయల్పడిన 8-0 అడుగుల వైష్ణవ ద్వారలపాశిల్పం కంటే పెద్దదైన ఈ శిల్పాని కాపాడుకొని తరువాతి తరాలకు అందించాలని శివనాగిరెడ్డి గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News