Monday, January 20, 2025

సిలిండర్లపై సీలింగ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోడి పాలనలో కేంద్ర ప్రభుత్వం సామన్య ప్రజల వంటిట్లో మరింత దూకుడుగా చొచ్చుకు పోయి మంటలు రగిలించేందుకు సిద్ధ్దమవుతోంది. ఇకపై ప్రతి ఇంటికి వంటగ్యాస్ ఏటా సాధారణ ధరలకు కేవలం మూడు సిలిండర్లను మాత్రమే అందజేయాలన్న ప్రతిపాదనలను తెరపైకి తెచ్చింది. ఏటా మూడు సిలిండర్లు దాటితే ఆపైన కొనుగోలు చేసే ప్రతి సిలిండర్‌పైనా రూ.500అదనపు ధర చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉన్నట్టు ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ ప్రతిపాదన కార్యరూపందాల్చి అమల్లోకి వచ్చేలోగా గ్యాస్ వినియోగదారులను మానసికంగా అదనపు ధరలకు చెల్లించేందకు కేంద్రప్రభుత్వం ఇటువంటి లీకులతో సిద్ధం చేస్తోంది.

ఇప్పటికే వంటగ్యాస్‌పై సబ్సిడీని పూర్తిగా ఎత్తివేసిన మోడి ప్రభుత్వం తాజాగా ఒక్కో సిలిండర్‌పైన రూ.50పెంచింది. దేశమంతటా వంటగ్యా స్ ధరల మంటలు చల్లారకముందే కేంద్ర త్రి నిర్మల వెల్లడించిన మూడు సిలిండర్ల పరిమితి ప్రతిపాదనలు అదేవేడిలో మరింత సెగను రాజేస్తోంది. ఇప్పటికే గృహావసరాలకు వినియోగించే గ్యాస్ ధర రూ.1155కు, హోటళ్లు ఇతర వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సి లిండర్ ధరను రూ.211.50కి పెంచింది. ఈ ధ రల పెంపుదలతో సామన్యులు మొదులకుని అ న్నివర్గాల ప్రజలు ఆగ్రహావేశాలతో కేంద్రంలోని మోడీ సర్కారుపై రగిలిపోతున్నారు. మరోమారు ధరలు పెంచితే ఇక ఎంతమాత్రం భ రించే పరిస్థితి కేంద్రం మాత్రం గ్యాస్‌వినియోగదారలు సహనానికి మరిన్ని పరీక్షలు పెడుతూ కొత్త ప్రతిపాదనలతో సవాళ్లు విసురుతోంది.

ధరలమంటకు రూ.2500కోట్లు !

కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌వినియోగదారులకు ఇప్పుడు సరఫరా చేస్తున్న గ్యాస్‌సిలిండర్ల సంఖ్యను ఏడాదిలో మూడింటికి మాత్రమే పరిమితం చేస్తే ప్రజల్లో మరింత హాహాకారాలు పుట్టుకు రానున్నాయంటున్నారు. సాధారణ మధ్యతరగతి కుటుంబాలు వంటింటి అవసరాలకు ఏటా సగటున 8 సిలిండర్లను వినిగిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనల మేరకు ఆర్ధికశాఖమంత్రి నిర్మలాసీతారామన్ మాటలో చెప్పాలంటే.. ఇవి మూడింటికే పరిమితం కానున్నాయి..ఆ పైన వినియోగించే ప్రతి సిలిండర్‌పైన రూ.500అదనంగా ధర చెల్లించాల్సివస్తుంది.

సామన్యులు తాము వినియోగించే 8సిలిండర్లలో మిగిలిన 5సిలిడర్లకు ఇప్పుడన్న ధర కంటే అదనంగా మరో రూ.500 చెల్లించాల్సివస్తుంది. ఇప్పుడున్న వంటింటి బడ్జెట్‌లో అదనంగా పెరిగే ధరలమేరకు ప్రతికుటుంబం ఏటా రూ.2500 అదనపు భారం మోయాల్సివస్తుంది. తెలంగాణ రాష్ట్రంలొ సుమారు కోటి 16లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో కేంద్రప్రభుత్వం ఉజ్వల పధకం కింద మంజూరు చేసిన 11.48లక్షల వంటగ్యాస్ కనెక్షన్లను మినహాయిస్తే మిగిలిన వినియోగదారులందరిపైన నెలకు మూడు సిండర్ల పరిమితి నిబంధన పెనుభారంగా మారనుంది. అదనంగా వినియోగించే 5సిలిండర్లకోసం వెచ్చించే రూ.2500 చోప్పున రాష్ట్ర వినియోగదారుపైన ఏటా రూ.2500కోట్లు అదనపు భారం పడనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News