Wednesday, January 22, 2025

మంచోళ్ళ కోసం అన్వేషణ.. వారిపైనే మంత్రులపై పరువు ప్రతిష్టలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వంలోని కింది నుంచి ఉన్నతస్థాయి హోదాల్లో పనిచేస్తున్న అధికారులు, మంత్రుల వరకూ అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజా పాలనను అందిస్తామని ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అం దుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రజలను గౌరవ ప్రదంగా చూసుకొం టూ అధికారులు, మంత్రుల పరువు, ప్రతిష్టలకు భంగం కలగకుండా, మొ త్తంగా ప్రభుత్వానికి చెడ్డపేరు తేకుండా మంచి పేరు తెచ్చేందుకు వీలు గా త గిన సిబ్బందిని నియమించుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వ పెద్దలు ఆచితూచి అడుగేస్తున్నారు.

ముఖ్యంగా ముఖ్యమంత్రి కార్యాలయంతోపాటుగా మంత్రు ల కార్యాలయాల్లో విధులు నిర్వర్తించాల్సిన అధికారులు, సి బ్బంది పనితీరు, వ్యవహారశైలిపైనే ప్రభుత్వ పరువు, ప్రతిష్టలు ఆధారపడి ఉంటాయని, అందుచేతనే పర్సనల్ స్టాఫ్‌ను నియమించుకునే విషయంలో నూ సిఎం రేవంత్‌రెడ్డి చాలా జాగ్రత్తలు తీసుకొంటున్నారని కొందరు సీనియర్ అధికారులు వివరించారు. మంత్రుల కార్యాలయాల్లో పనిచేసే పర్సనల్ అసిస్టెంట్ (పిఏ),పర్సనల్ సెక్రటరీ(పిఎస్),ఆఫీసర్ ఆన్‌స్పెషల్ డ్యూ టి (ఓఎస్‌డి), ప్రజా సంబంధాల అధికారి (పిఆర్‌ఓ), డేటా ఎంట్రీ ఆ పరేటర్లు వంటి పోస్టుల భర్తీలో అనేక జాగ్రత్తలు తీసుకొంటున్నారని, అం దుకే పర్సనల్ సిబ్బందిని ఏర్పాటు చేసుకునే కార్యక్రమాలు కూడా పూర్తికాలేదని కొందరు అధికారులు వివరించారు.

ఎందుకంటే మంత్రుల కార్యాలయాలకు వచ్చే ప్రజలు, అధికారులు, ఇతర అతిధులు, వాణిజ్య, పారిశ్రామికవేత్తలతో మర్యాదగా వ్యవహరించడమే కాకుండా అవినీతికి పాల్పడకుండా గౌరవంగా చూసుకుంటేనే మంత్రులకు తద్వారా ప్రభుత్వానికీ మంచిపేరు వస్తుందని, అలా కాకుండా గాలికి వదిలేసినట్లుగా పేషీల్లో పనిచేసే వారి ఇష్టానుసారానికి మంత్రిత్వశాఖను వదిలేస్తే మంత్రులకు చెడ్డపేరు వస్తుందని, అదే జరిగితే ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు వస్తుందని, అందుకే “మంచోళ్ళ కోసం అన్వేషిస్తున్నామని” కొందరు సీనియర్ అధికారులు వివరించారు.

పిఎ, పిఎస్, ఓఎస్‌డి, పిఆర్‌ఓ వంటి అ త్యంత ముఖ్యమైన, కీలకమైన పోస్టులను భర్తీ చేసుకోవడానికి ముందుగా ఆసక్తి ఉన్న వారి నుంచి బయోడేటాలను తీసుకొని ఇంటెలిజెన్స్ విభాగంతో సంపూర్ణంగా దర్యాప్తు జరిపించి పక్కాగా వ్యక్తిగత సమాచారాన్ని తెప్పించుకొన్న తర్వాతనే తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతోందని వివరించారు. అం దుకు తగినట్లుగా ముఖ్యమంత్రి కార్యాలయం కార్యదర్శి శేషాద్రి, చీఫ్ సెక్రటరి శాంతి కుమారి, ముఖ్యమంత్రి సిపిఆర్‌ఓ బోరెడ్డి అయోధ్యరెడ్డిలు పూర్తిగా సమీక్షించుకొన్న తర్వాతనే మంత్రుల పర్సనల్ స్టాఫ్ నియామకా లు జరుగుతున్నాయని వివరించారు. తమవద్దకు వచ్చిన దరఖాస్తు లు, బ యోడేటాలపై తొలిదశ ఇంటెలిజెన్స్ పరిశీలన జరిగిందని, కొందరు పిఎ, పిఎస్‌లపై వేటు వేశామని వెల్లడించారు. అయితే గత ప్రభుత్వంలో మంత్రులు, సిఎంఓలో పనిచేసిన అధికారులు, పిఎ, పిఎస్, పిఆర్‌ఓలను ఇప్పుడు మళ్ళీ తీసుకోవద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని, అందుకే గత ప్రభుత్వంలో పనిచేసిన పిఎ, పిఎస్‌లు, పిఆర్‌ఓలను తమస్థాయిలోనే తిరస్కరిస్తున్నామని వివరించారు.

అయితే ఇప్పటికే మం త్రుల వద్ద అనేక సంవత్సరాలుగా, దశాబ్దాలుగా పనిచేస్తూ వచ్చిన పిఎ, పిఎస్, పిఆర్‌ఓ విషయంలో ఎలాం టి ఇబ్బందుల్లేవని, వారంతా ఇప్పుడు మంత్రులుగా ఉన్న నేతలకు పదవులు ఉన్నా, లేకపోయిన సమయంలో కూడా పనిచేస్తూ వచ్చారు గనుక అలాంటి నమ్మకస్తుల విషయంలో ఎ లాంటి అనుమానాలు లేవని, వారని కొనసాగించు కోవడానికి సిఎం రేవంత్‌రెడ్డి ఎలాంటి అభ్యంతరాలు తెలపలేదని వివరించారు. సమ స్య మొత్తం కొత్తగా నియమించుకోబోయే పిఎ, పిఎస్, ఓఎస్‌డి, పిఆర్‌ఓల విషయంలోనే అని వివరించారు. గత ప్రభుత్వంలో మంత్రుల వద్ద పనిచేసిన పిఎ, పిఎస్, పిఆర్‌ఓల్లో కొంతమంది మళ్ళీ తమ ప్రభుత్వంలో చేరేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని, వత్తిళ్ళు కూడా పెరుగుతున్నాయని, అందుచేతనే సిఎం రేవంత్‌రెడ్డి అనేక జాగ్రత్తలు తీసుకొంటున్నారని అన్నారు.

ఇదిలా వుండగా ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా పిఎ, పిఎస్, పిఆర్‌ఓలుగా చేరేందుకు గత ప్రభుత్వంలో పనిచేసిన కొందరు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మాజీ పిఎ, పిఎస్, పిఆర్‌ఓలు మాత్రం విభిన్నవాదనలను తె రపైకి తెస్తున్నారు. రెండు, మూడు నెలల గ్యాప్ ఇచ్చిన తర్వాత తప్పకుండా తాము ఈ ప్రభుత్వంలో కూడా పోస్టులు సంపాదిస్తామని ధీమా గా చెబుతున్నారు. “కొత్త మురిపం కాబట్టి కా స్తంత బెట్టు చేస్తున్నారని, కొంచెం పాతబడి పో యిన తర్వాత అంతా మామూలే” అవుతుందని గత ప్రభుత్వంలో పనిచేసిన కొందరు అధికారులు ధీమాను వ్యక్తంచేస్తున్నారు. అంతేగాక రా జకీయ నాయకులైతే ఒకపార్టీ నుంచి వేరొక పార్టీలోకి చేరవచ్చు, పార్టీలు మారనూ వచ్చుగానీ తాము మాత్రం ఒక ప్రభుత్వంలో పనిచేసి వేరొక ప్రభుత్వంలో పనిచేయడానికి పనికిరా మా..? అ ని కొందరు మాజీ పిఎ, పిఎస్‌లు వాదిస్తున్నారు.

అంతేగాక పిఎ, పిఎస్‌లు విధులుని ర్వర్తించడం అంత ఈజీ కాదని, ఈ విధులు ని ర్వర్తించడానికి తప్పనిసరిగా అనుభవం ఉండి తీరాల్సిందేనని, లేకుంటే కొత్త వారిని తీసుకుంటే వారికి విధి నిర్వహణలోని మెళుకువలు అర్ధమయ్యేసరికి పు ణ్యకాలం గడిచిపోతుందని ఆ మాజీలు అంటున్నారు. అందుచేతనే తాము కూడా తొందరపడకుండా వేచి చూస్తున్నామని, తప్పకుండా తాము ధరఖాస్తు చేసుకొన్న మంత్రుల వద్ద నుంచి పిలు పు వస్తుందని ఆ అధికారులు ధీమాను వ్యక్తంచేస్తున్నారు. మాజీలను తీసుకొంటారా… లేక కొత్త వారికి ఛాన్స్‌లిచ్చి నియామకాలు చేస్తారా… అనేది ఈనెలాఖరుకు తేలిపోనుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News