Thursday, November 21, 2024

బ్లాక్‌బాక్సుల కోసం నేవీ డైవర్ల వేట

- Advertisement -
- Advertisement -

Search for SriWijaya aircraft black boxes

 

సిగ్నల్స్ ఆధారంగా గుర్తించిన సిబ్బంది

జకార్తా: జావా సముద్రంలో కూలిపోయిన శ్రీవిజయ విమానం బ్లాక్ బాక్స్‌ల కోసం తమ దేశ నేవీ డైవర్స్ గాలిస్తున్నారని ఇండోనేసియా అధికారులు సోమవారం వెల్లడించారు. సిగ్నల్స్ ఆధారంగా బ్లాక్ బాక్సులున్న ప్రాంతాన్ని గుర్తించామని అధికారులు తెలిపారు. జకార్తా తీరానికి ఉత్తరదిశలో థౌసెండ్ ఐల్యాండ్స్‌లోని ల్యాన్‌క్యాంగ్, లేకీ ఐల్యాండ్స్ మధ్య బ్లాక్‌బాక్స్ నుంచి సిగ్నల్స్ రావడాన్ని గుర్తించామని అధికారులు తెలిపారు. 20 మీటర్ల లోతున సముద్రంలోని బురదలోకి బ్లాక్‌బాక్సులు కూరుకుపోయినట్టు భావిస్తున్నారు. హైటెక్ పరికరాలతో వాటిని గుర్తించేందుకు డైవర్స్ ప్రయత్నిస్తున్నారు. బ్లాక్‌బాక్సులు దొరికిన వెంటనే విమాన ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్న నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ కమిటీకి ఇవ్వనున్నట్టు వారు తెలిపారు.

శనివారం జకార్తా నుంచి బయల్దేరిన 737500 బోయింగ్ విమానం కొన్ని నిమిషాల్లోనే ఆచూకీ లేకుండా పోయింది. చివరికి అది జావా సముద్రంలో కూలిపోయినట్టు ఇండోనేసియా నౌకాదళం గుర్తించింది. అందులోని సిబ్బందిసహా 62మంది జలసమాధి అయినట్టు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో మరణించినవారితోపాటు విమాన శకలాలను వెలికి తీసేందుకు 12 హెలికాప్టర్లు, 53 నేవీ పడవలు, 20 మర పడవలతో 2600మంది రెస్కూ సిబ్బంది జావా సముద్రంలో గాలిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరూ సజీవంగా బయటపడినట్టు ఎలాంటి సమాచారమూ లేదు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News