Saturday, November 23, 2024

పులికోసం ‘అష్ట’ దిగ్భందనం

- Advertisement -
- Advertisement -

డ్రోన్ కెమెరాలతో వేట
ఒకే పులి సంచరిస్తోంది: సిఎఫ్ వినోద్‌కుమార్

Search for Tiger in all sides

మనతెలంగాణ/హైదరాబాద్ : కొమురంభీం జిల్లాలో కాగజ్ నగర్ కారిడార్ లో మనుషులను చంపిన పులిని పట్టుకోవడం కోసం అధికారులు అడవుల్లో ఆపరేషన్ చేపట్టారు. ఈక్రమంలో పులిని పట్టుకోవడానికి ప్రత్యేక టీములను రంగంలోకి దింపారు. గత ఏడాది 2020 నవంబర్ లో పెద్దపులి ఇద్దరిని పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. కాగా పులిని పట్టుకుంటామని అధికారులు ప్రకటించి ఇప్పటికి నెలలు దాటినప్పటికీ పట్టుకోలేకపోయారు. ఒకవైపు పులిని పట్టుకునేందుకు ఆపరేషన్ కొనసాగుతుండగానే పెంచికల్ పేట మండలం కొండపల్లిలో మరో మహిళపై పంజా విసిరి చంపడంతో పాటు మరో ఇద్దరు ఆదివాసులను పొట్టన పెట్టుకుంది. ఈక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ఇద్దరిని పొట్టనపెట్టుకున్న పులి, మరో ఇద్దరిపై దాడి చేసిన పులి ఒక్కటేనని అధికారులు నిర్ధారణకు వచ్చారు.దీంతో ఇప్పటికే ఆపరేషన్ కొనసాగుతుండగా తాజాగా డ్రోన్ కెమెరాలను సైతం రంగంలోకి దించారు.

‘అష్ట’ దిగ్భందనం

అటవీ ప్రాంతంలో పులి సంచరించే 8 ప్రాంతాల్లో అటవీశాఖ అధికారులు పెద్ద ఎత్తున నిఘా పెట్టారు. పులికి మత్తు మందు ఇచ్చేందుకు వందల కొద్దీ ట్రాక్ కెమెరాలు, 14 బోన్లు ఏర్పాటు చేశారు. 40 మంది వరకు యానిమల్ ట్రాకర్స్ పులి ఆనవాళ్లు గుర్తించే పనిలో ఉన్నారు. పులి సంచరిస్తుందని అనుమానం ఉన్న తలాయి, గుండ్లపల్లి, కందిభీమన్న అటవీ ప్రాంతాల్లో మంచెలు ఏర్పాటు చేశారు. ఈ మంచెలపై నుంచే పులికి మత్తుమందు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మంచేల మీద నుంచి నిపుణులైన షూటర్స్ తో మత్తు మందు ప్రయోగం చేయనున్నారు అధికారులు. మంచెలపై ఉండి పులి కోసం ఎదురు చూస్తున్నారు మత్తు ఇచ్చే నిపుణులు.. ఇప్పటి కే ఆపరేషన్ జరిగే బేజ్జూరు అటవీ ప్రాంతం వైపు ఎవరు వెళ్లొద్దని అటవీ శాఖ అధికారులు సూచించారు. ఇక, తాజాగా డ్రోన్ కెమెరాలను కూడా రంగంలోకి దించడంతో పాటు బెజ్జూరు మండలం అటవీ ప్రాంతంలో డ్రోన్ కెమెరాలతో పులిని అన్వేషిస్తున్నారు. పులికి మత్తు ఇచ్చేందుకు మూడు రోజులుగా అటవీ ప్రాంతంలో బృందాలు మకాం వేయడంతో పాటు పులికి మత్తు ఇచ్చాక దాని కదలికలను గుర్తించేందుకు సైతం డ్రోన్‌లను ఉపయోగిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

ఒకే పులి సంచరిస్తోంది: సిఎఫ్ వినోద్‌కుమార్

సులుగు పల్లి లో కనిపించిన పులి, అటవీశాఖ అధికారులు టార్గెట్ చేసిన పులి ఒక్కటేనని సిఎఫ్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. కొమురం భీం జిల్లాలో పులి కోసం అటవీ అధికారుల అన్వేషణ నసాగుతోందన్నారు. అటవీ ప్రాంతాలతో పాటు పంట పొలాల వైపు సైతం ఎవరూ వెళ్లొద్దని ఆంక్షలు విధించామని, పులిని బంధించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. పులి జాడ కనుక్కొనేందుకు డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టామని, అటవీప్రాంతంలో డ్రోన్ కెమెరాతో పులి అన్వేషణ కొనసాగుతోందన్నారు. ఈ ప్రాంతంలో సంచరిస్తున్న పులి గురించి పూర్తిగా తెలుసుకున్నామని, గత ఆరున్నర నెలల నుంచి ఈ టైగర్ హిస్టరీ తెలుసుకున్నామని సిఎఫ్ వినోద్ కుమార్ తెలిపారు. మహ రాష్ట్ర స్తేషన్ లో పుట్టి పెరిగిన ఈ పులి అక్కడి ప్రభుత్వం పట్టుకోవడం కోసం ఆర్డర్స్ తీశారని అయితే వాళ్ళు పట్టుకునే లోపే ఆ పులి ఇటు వైపు వచ్చిందన్నారు. ఈ పులి జనావాసాల పరిసరాల్లో తిరుగుతుందని, దీనికి మనుషులకి అపాయం చేసే బిహేవియర్ ఉంటుందన్నారు. అనతికాలంలో ఆ పులిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని సిఎఫ్ వినోద్ కుమార్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News