Tuesday, November 5, 2024

ఆచూకీ లేని టైటాన్..

- Advertisement -
- Advertisement -

దుబాయ్ : సముద్ర గర్భంలో గల్లంతైన టైటాన్ కోసం గత మూడు రోజులుగా గాలిస్తున్నా ఇంతవరకు ఆచూకీ లభించలేదు. అత్యవసర పరిస్థితుల్లో 96 గంటల పాటు ఆక్సిజన్ ఉండేలా ఈ జలాంతర్గామిని రూపొందించారు. ఉత్తర అట్లాంటిక్ లో టైటాన్ యాత్ర ఆదివారం ఉదయం ప్రారంభమైంది. అప్పటి నుంచి నాలుగు రోజులకు సరిపడా ఆక్సిజన్ అందులో ఉంటుందని అంచనా. అయితే అందులోని ఆక్సిజన్ నిండుకోవడం ఆందోళన కలిగిస్తోంది. భారత కాలమాన ం ప్రకారం గురువారం సాయంత్రం 7.15 గంటల వరకే ఆక్సిజన్ సరిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆక్సిజన్‌ను ఎంత పొదుపుగా వాడుకోడానికి ప్రయత్నించినా మరికొంత సమయం వరకే ఆక్సిజన్ సరఫరా అవుతుందని అంచనా వేస్తున్నారు. ఆదివారం ఉదయం గల్లంతైన తరువాత అందులోని ప్రయాణికులు సజీవంగా ఉన్నారా లేదా అన్నది తెలియదని నిపుణులు భావిస్తున్నారు.

అందులోని పర్యాటకులు , సిబ్బందికి అవసరమైన ఆహారం కూడా పరిమితంగానే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అయినప్పటికీ రెస్కూ ఆపరేషన్‌పై ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగుతోంది. అమెరికా కోస్ట్‌గార్డ్, కెనడా సైనిక విమానాలు, ఫ్రెంచ్ నౌకలు, టెలీగైడెడ్ రోబోలు భారీ ఎత్తున ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. కెనడా విమానం సోనార్ సాయంతో బుధవారం కొన్ని శబ్దాలను గుర్తించినప్పటికీ, అవి ఎక్కడ నుంచి వస్తున్నాయో స్పష్టంగా తెలుసుకోలేక పోయారు. కొన్ని రిస్కూ బృందాలు శబ్దాలు వస్తున్న ప్రదేశానికి వెళ్లి అన్వేషించడం ప్రారంభించాయి. సబ్‌మెరైన్ అన్వేషణరిస్కు నిపుణుడు ఫ్రాంక్ ఓవెన్ ఆక్సిజన్ సరఫరా అంకె అన్వేషించడానికి ఉపయోగపడే లక్షంగా పేర్కొన్నారు. అయితే అది నామమాత్రపు వినియోగ మొత్తంపై ఆధారపడి ఉంటుందన్నారు. రిస్కు బృందాలు అన్వేషణ కోసం సముద్రంలో కొంతభాగం నిర్జలీకరణ చేశారు. అది కొన్ని వేల మైళ్ల పరిధి వరకు విస్తరించారు.

నిర్జలీకరణ ప్రాంతానికి రెట్టింపు పరిమాణంలో , రెండున్నర మైళ్ల లోతున అన్వేషించడం సాగిస్తున్నారు. మరోవైపు ఈ జలాంతర్గామి భద్రతపై 2018లో నిపుణులు ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీన్ని అమెరికన్ బ్యూరో ఆఫ్ షిప్పింగ్‌తో ధ్రువీకరణ పొందడానికి ఆ సంస్థ నిరాకరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ జలాంతర్గామిలో పాకిస్థాన్ బిలియనీర్ షెహజాదా దావూద్ (48), ఆయన కుమారుడు సులేమాన్ (19), యూఏఈలో ఉన్న బ్రిటిష్ వ్యాపారవేత్త హమీష్ హార్డింగ్ , యాత్ర నిర్వాహకుడు, ఓషన్‌గేట్ వ్యవస్థాపకుడు స్టాక్టన్ రష్, ఫ్రెంచ్ మాజీ నావికాధికారి పాల్ హెన్నీ ఉన్నారు.

 

రా’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News