Monday, January 20, 2025

కిరణ్ అద్భుతంగా నటించాడు

- Advertisement -
- Advertisement -

Sebastian PC 524 Movie

 

జ్యోవిత సినిమాస్ పతాకంపై కిరణ్ అబ్బవరం, కోమలీ ప్రసాద్, నివేక్ష నటీనటులుగా బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వంలో సిద్ధారెడ్డి బి, జయచంద్ర రెడ్డి, రాజు, ప్రమోద్‌లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘సెబాస్టియన్ పిసి524’. ఈ చిత్రం మార్చి 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ట్విట్టర్ ద్వారా సెన్సేనల్ హీరో విజయదేవరకొండ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో నిర్మాత సిద్దారెడ్డి మాట్లాడుతూ ఫ్యామిలీ అంతా చూసే విధంగా సినిమాను తెరకెక్కించడం జరిగిందని అన్నారు. దర్శకుడు బాలాజీ మాట్లాడుతూ “ఈ సినిమా ఒక రకమైన కామిక్, సస్పెన్స్, థ్రిల్లింగ్ కలిగిస్తుంది. ఈ సినిమాలో కిరణ్ అద్భుతంగా నటించాడు”అని తెలిపారు. హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ “ఈ సినిమాలో రేచీకటి ఉన్న మనిషి జీవితం ఎలా ఉంటుందనేది దర్శకుడు బాలాజీ చాలా బాగా చూపించారు. జిబ్రాన్ సంగీతం దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలోని పాటలన్నీ అద్భుతంగా వచ్చాయి”అని చెప్పారు. ఈ కార్యక్రమంలో నివేక్ష, రాజు, ప్రమోద్, విప్లవ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News