Sunday, December 22, 2024

కిరణ్ అద్భుతంగా నటించాడు

- Advertisement -
- Advertisement -

Sebastian PC 524 movie

పల్లె వాతావరణానికి, స్వచ్ఛమైన ప్రేమకథకు పెద్దపీట వేస్తూ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో రేచీకటి నేపథ్యంలోని కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న కామెడీ థ్రిల్లర్ ‘సెబాస్టియన్ పిసి 524’. కిరణ్ అబ్బవరం హీరోగా ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో జ్యోవిత సినిమాస్ పతాకంపై బి.సిద్దారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని శుక్రవారం థియేటర్స్‌లలో ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకీ కుడుముల, వేణు శ్రీరామ్, మైత్రి మూవీ మేకర్స్ రవి శంకర్, చెర్రీ, సీనియర్ నటుడు సాయి కుమార్, హీరోలు అడవి శేష్ ,ఆకాష్ పూరి, సప్తగిరి, నిర్మాత కోడి దివ్య, లిరిక్స్ రైటర్ భాస్కర పట్ల తదితరులు పాల్గొని చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలియ జేశారు.

ఈ సందర్భంగా నిర్మాత సిద్దారెడ్డి మాట్లాడుతూ “ఈ సినిమా అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. కిరణ్ కష్టపడే తత్వాన్ని చూసి తనకు సపోర్ట్ చేయడానికి మేము ముందుకు వచ్చాము”అని అన్నారు. హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ “ఈ సినిమా కోసం 24 క్రాఫ్ట్ అందరూ కూడా నిద్రలేకుండా పని చేశారు. ఈ సినిమా చూసిన తరువాత ప్రేక్షకులందరూ కూడా చాలా మంచి సినిమా చేశారని మెచ్చుకుంటారు. రేచీకటి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి వినోదాన్ని అందిస్తుంది”అని తెలిపారు. చిత్ర దర్శకుడు బాలాజీ సయ్యపురెడ్డి మాట్లాడుతూ “ఈ సినిమా చూస్తున్నప్పుడు హీరో కిరణ్ కనిపించడు. ‘సెబాస్టియన్‘ మాత్రమే కనిపించేలా అద్భుతంగా నటించాడు కిరణ్. జిబ్రాన్ మ్యూజిక్ ఈ చిత్రానికి హైలెట్ అవుతుంది”అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News