Monday, January 20, 2025

ఆకట్టుకుంటున్న ‘సెబాస్టియ‌న్ పిసి524’ టీజర్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ‘ఎస్ఆర్ క‌ళ్యాణ‌మండ‌పం’ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో కిరణ్ అబ్బ‌వ‌రం ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘సెబాస్టియ‌న్ పిసి524’. బాలాజీ స‌య్య‌పురెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. న్యూ కాన్సెప్ట్ తో ఫన్ ఎంటర్ టైనర్ గా రూపొందించిన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.ఈ చిత్రంలో కిర‌ణ్ అబ్బ‌వ‌రం రేచిక‌టున్న‌ పోలీస్ పాత్ర‌లో నటిస్తున్నాడు. నువేక్ష‌, కోమ‌లి ప్ర‌సాద్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.ఎలైట్ ఎంటర్టైన‌మెంట్స్ సంస్థ‌లో జోవితా సినిమాస్ బ్యాన‌ర్‌పై సిద్ధారెడ్డి, ప్ర‌మోద్, రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందించాడు. ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వరి25న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువస్తున్నారు.

‘Sebastian PC524’ Movie Teaser Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News