ముంబయి: భారత్‌లో బంగారం స్పాట్ ట్రేడింగ్ ఫ్రేమ్‌వర్క్‌ను ‘ ద సెక్యూరిటీస్ అండ్ ఎక్‌ఛేంజీ బోర్డ్ ఆఫ్ ఇండియా’(సెబీ) ఆమోదించింది. ప్రస్తుతం దేశంలో గోల్డ్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌ను మాత్రమే అనుమతిస్తున్నారు. కానీ చైనా తదితర దేశాలు గోల్డ్ స్పాట్ ట్రేడింగ్‌ను అనుమతిస్తున్నాయి. బడ్జెట్‌లో స్పాట్ గోల్డ్ ఎక్స్‌ఛేంజీల రెగ్యులేటర్‌గా సెబీ ఉండగలదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన తర్వాత ఇలాంటి చర్య ఏదో తీసుకుంటారని అనుకోవడం జరిగింది.
ఎలెక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్(ఇజిఆర్) ద్వారా బంగారాన్ని ట్రేడింగ్ చేయడం జరుగుతుంది. ఈ ఇజిఆర్‌లను వాల్ట్ మేనేజర్లు సృష్టిస్తారు. రూ. 50 కోట్ల నెట్‌వర్త్ ఉన్న ఉన్నవారు సెబీ ద్వారా వాల్ట్ మేనేజర్లుగా రిజిష్టరవుతారు. గోల్డ్ డిపాజిట్లు, నిల్వ, భద్రంగా ఉంచడం ద్వారా వారు ఈ ఇజిఆర్‌లను సృష్టిస్తారు. సెక్యూరిటీ కాంట్రాక్ట్(నియంత్రణ)చట్టం 1956 కింద ఇజిఆర్‌లను సెక్యూరిటీలుగా ప్రకటిస్తారు. పాత, కొత్త ఎక్స్‌ఛేంజీలు ఏవైనా సరే ప్రత్యేక సెగ్మెంట్‌లో ఇజిఆర్‌ల ట్రేడింగ్‌ను లాంచ్ చేయవచ్చు. ఆ ఎక్స్‌ఛేంజీలు ఇజిఆర్‌ల డినామినేషన్లను(ఉదాహరణకు 1గ్రా.,2గ్రా., 10గ్రా. ఇత్యాదులుగా) సెబీ ఆమోదంతో ట్రేడింగ్‌కు అనుమతించవచ్చు. ఇజిఆర్ హోల్డర్ తాను కోరుకున్నని రోజులు ఇజిఆర్‌ను ఉంచుకోవచ్చు. వాటికి పర్‌పెచ్యువల్ వాల్యూ ఉంటుంది. ఇజిఆర్ హోల్డర్ ఇజిఆర్‌ను వాల్ట్ మేనేజర్‌కు ఇచ్చి అండర్‌లైయింగ్ గోల్డ్‌ను కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా పారిశ్రామిక నిపుణులు ఈ చర్యను స్వాగతించారు.
ఈ చర్య ప్రాంతీయ ధరల హెచ్చుతగ్గులను రూపుమాపి ఒకే ధరను ఏర్పరుస్తుందని ఆల్ ఇండియా జెమ్ అండ్ జులరీ డొమెస్టిక్ కౌన్సిల్(జిజెసి) ఛైర్మన్ ఆశిస్ పెథే అభిప్రాయపడ్డారు. మదుపరులు కావాలనుకుంటే గోల్డ్ ఇటిఎఫ్, గోల్డ్ ఫ్యూచర్స్‌లో, సావరిన్ గోల్డ్ బాండ్‌లలో కూడా మదుపుచేసుకోవచు. సావరిన్ బాండ్లు వడ్డీని ఇస్తాయి కనుక వాటి లిక్విడిటీ తక్కువగా ఉంటుంది. అది గోల్డ్ ఎక్స్‌ఛేంజీకి అనుకూలంగా ఉండగలదని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎండి సిజె జార్జ్ తెలిపారు.
చైనా తర్వాత బంగారాన్ని అత్యధికంగా వినియోగించే రెండవ దేశం భారత్. సంవత్సరానికి 700 నుంచి 800 టన్నుల డిమాండ్ భారత్‌లో ఉంటోంది. 2020లో కోవిడ్-19 తర్వాత బంగారం డిమాండ్ బాగా పడిపోయింది. దాదాపు 25 ఏళ్ల కనిష్ఠానికి,అంటే 446 టన్నులకు పడిపోయిందని ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ నివేదించింది.