Thursday, November 21, 2024

టాటా టెక్ ఐపిఒకు సెబీ ఆమోదం

- Advertisement -
- Advertisement -

ముంబై : టాటా మోటార్స్ అనుబంధ సంస్థ టాటా టెక్నాలజీస్ ఐపిఒ(ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్)కు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. సెబీ ఆమోదంతో రెండు దశాబ్దాల తర్వాత టాటా గ్రూప్ కంపెనీ ఐపిఒకు మార్గం సుగమమైంది. టాటా టెక్నాలజీస్ ఐపిఒ తీసుకురావడానికి మార్చి 2023లో సెబీ వద్ద డ్రాఫ్ట్ పేపర్‌ను కంపెనీ దాఖలు చేసింది. టాటా టెక్నాలజీస్ ఐపిఒలో అన్ని షేర్లు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయిస్తారు.

అంటే ప్రస్తుత ఇన్వెస్టర్లు ఐపిఒలో 23.60 శాతం వాటాకు సమానమైన 9.57 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. టాటా టెక్నాలజీస్ ఐపిఒలో కొత్త షేర్లు జారీ ఉండదు. టాటా టెక్నాలజీస్‌లో టాటా మోటార్స్ 74.42 శాతం వాటాను కలిగి ఉంది. టాటా టెక్నాలజీస్ ఐపిఒను తీసుకురావడానికి 2023 మార్చి 9న సెబీకి డ్రాఫ్ట్ పేపర్‌ను దాఖలు చేసింది. సింగపూర్‌కు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ ఆల్ఫా టిసి హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, టాటా క్యాపిటల్ అడ్వైజర్స్ నిర్వహణలో కంపెనీలో 8.96 శాతం వాటాను కలిగి ఉంది.

టాటా క్యాపిటల్ గ్రోత్‌లో 4.48 శాతం వాటా ఉంది. ఇది కాకుండా టాటా మోటార్స్ ఫైనాన్స్, టాటా ఎంటర్‌ప్రైజెస్ ఓవర్సీస్, రతన్ టాటా, ఎస్ రామదొరైకి కూడా కంపెనీలో వాటాలు ఉన్నాయి. టాటా టెక్నాలజీస్ ఐపిఒ ద్వారా మార్కెట్ నుంచి దాదాపు రూ.4,000 కోట్లు సమీకరించవచ్చు. టాటా గ్రూప్ చాలా కాలంగా మార్కెట్లోకి ఎలాంటి ఐపిఒ తీసుకురాలేదు. 19 ఏళ్ల క్రితం 2004లో ఐటీ రంగంలో అతిపెద్ద కంపెనీ అయిన టిసిఎస్ ఐపిఒను టాటా గ్రూప్ తీసుకొచ్చింది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News