Sunday, December 22, 2024

ఏడు వ్యాపార సంస్థల ఆస్తులకు సెబీ వేలం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పెట్టుబడిదారుల సొమ్మును తిరిగి పొందేందుకు ఏడు వ్యాపార గ్రూపుల ఆస్తులను మార్కెట్ రెగ్యులేటర్ సెబీ వేలం వేయనుంది. జూన్ 28న జరగనున్న ఈ వేలం రిజర్వ్ ధర రూ.51 కోట్లుగా నిర్ణయించారు. వీటిలో ఎంపిఎస్ గ్రూప్, ప్రయాగ్ గ్రూప్, వారిస్ ఫైనాన్స్, టవర్ ఇన్ఫోటెక్, విబ్‌గ్యోర్, ఇతరాలు ఉన్నాయి. వీటన్నింటిలో మొత్తం 17 ఆస్తులను వేలానికి ఉంచినట్లు సెబీ తెలిపింది.

దీనిలో పశ్చిమ బెంగాల్‌లో ఉన్న భవనాలు, ఫ్లాట్లు, వాణిజ్య ఆస్తులు ఉన్నాయి. ఈ ఏడు సంస్థలు రెగ్యులేటరీ నిబంధనలను ఉల్లంఘించి ఇన్వెస్టర్ల నుండి డబ్బును సేకరించడంతో సెబీ చర్యలు చేపట్టింది. పెట్టుబడిదారులను వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలని సెబీ ఆదేశించినప్పటికీ డబ్బు రాకపోవడంతో ఈ సంస్థ కొన్ని ఆస్తులు అటాచ్ చేసింది. మార్కెట్ రెగ్యులేటర్ డీమ్యాట్, బ్యాంక్ ఖాతాలను కూడా జప్తు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News