Wednesday, January 22, 2025

అనిల్ అంబానీ కార్యకలాపాలపై సెబీ నిషేధం

- Advertisement -
- Advertisement -

ముంబయి: స్టాక్ మార్కెట్‌లో అనిల్ అంబానీ కార్యకలాపాలపై సెబీ నిషేధం విధించింది. నిధులు మళ్లింపు వ్యవహారంలో అనిల్‌పై సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. ఐదేళ్లపాటు అనిల్ అంబానీ కార్యకలాపాలపై నిషేధం విధించింది. అనిల్ అంబానీకి చెందిన 24 సంస్థలపైనా సెబీ నిషేధం విధించడంతో పాటు ఆయనకు రూ.25 కోట్ల జరిమానా విధించింది.

రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌ను సెక్యూరిటీల మార్కెట్ నుండి ఆరు నెలల పాటు నిషేధించడంతో పాటు రూ. 6 లక్షల జరిమానా విధించింది. ఆర్ హెచ్ ఎఫ్ఎల్ లో అధికారుల సహాయంతో అనిల్ అంబానీ నిధులు దుర్వినియోగం చేసినట్టు సెబీ గుర్తించింది. రుణ విధానాలను నిలిపివేయడంతో పాటు కార్పొరేట్ రుణాలను క్రమం తప్పకుండా సమీక్షించాలని ఆర్ హెచ్ఎఫ్ఎల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు బలమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ కంపెనీ యాజమాన్యం వారి ఆదేశాలను పట్టించుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News