Sunday, December 22, 2024

పార్లమెంటరీ సంఘం విచారణకు సెబీ చీఫ్ మాధబి పూరి బుచ్ డుమ్మా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ:  సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) ఛైర్‌పర్సన్ మాధబి పూరి బుచ్ దర్యాప్తు చేస్తున్న పార్లమెంటరీ ప్యానెల్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పిఎసి) విచారణకు “వ్యక్తిగత అవసరాల” కారణంగా హాజరు కావడం లేదని సెబి చీఫ్ తెలియజేసిన తర్వాత విచారణను కమిటీ వాయిదా వేసింది.

అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నుంచి తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో స్టాక్ రెగ్యులేటర్ల పనితీరుపై సెబీ అధికారులను ప్రశ్నిస్తున్నారు. గత కొన్ని నెలలుగా, సెబీ చీఫ్ మాధబి పూరి బుచ్ అదానీ గ్రూప్‌తో ముడిపడి ఉన్న ఆఫ్‌షోర్ ఫండ్స్‌ లో ఆమె పెట్టుబడులు , ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి మొదట షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ నుండి , తరువాత ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నుండి అనేక ఆరోపణలను ఎదుర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News