Tuesday, November 5, 2024

ఎల్‌ఐసి ఐపిఒకు సెబీ గ్రీన్‌సిగ్నల్

- Advertisement -
- Advertisement -
SEBI gives green signal to LIC IPO
31 కోట్ల ఈక్విటీ షేర్ల విక్రయం
పాలసీ హోల్డర్లకు 10 శాతం రిజర్వ్

న్యూఢిల్లీ : ఎల్‌ఐసి మెగా ఐపిఒ(ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్)కు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్‌ఐసి) ఐపిఒ ద్వారా ప్రభుత్వం రూ.63 వేల కోట్లను సమీకరించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(202122) ముగింపులోగా పెట్టుబడి ఉపసంహరణ లక్ష్యాన్ని చేరుకోవడం ఈ ఐపిఒ దోహదం చేస్తుందని కేంద్రం భావిస్తోంది. గత నెల 13న ఎల్‌ఐసి దాఖలు చేసిన డిఆర్‌హెచ్‌పి(డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్)కు సెబీ ఇప్పుడు ఆమోదం ప్రకటించింది. డిఆర్‌హెచ్‌పి ప్రకారం, ఎల్‌ఐసి ఐపిఒ కింద ప్రభుత్వం 31 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. పాలసీ హోల్డర్లకు 10 శాతం షేర్ రిజర్వ్ ఉంటుంది.

వీరికి షేర్ ధరలో 5 శాతం తగ్గింపును కూడా ఇవ్వనున్నారు. రిజర్వేషన్ ప్రయోజనాన్ని పొందడానికి, పాలసీదారులు పాన్‌ను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది భారతీయ స్టాక్ మార్కెట్‌లో ఇప్పటివరకు అతిపెద్ద ఐపిఒ అవుతుంది. లిస్టింగ్ తర్వాత ఎల్‌ఐసి మార్కెట్ వాల్యుయేషన్ ఆర్‌ఐఎల్, టిసిఎస్ వంటి టాప్ కంపెనీలతో సమానంగా ఉండనుంది. దీనికి ముందు పేటీఎం ఐపిఒ అతిపెద్దది, ఈ కంపెనీ గత సంవత్సరం ఇష్యూ ద్వార రూ.18,300 కోట్లను సమీకరించింది. ఇటీవల ఈ ఐపిఒలో విదేశీ పెట్టుబడిదారులను తీసుకునేందుకు కేంద్ర మంత్రివర్గం ఎఫ్‌డిఐ విధానాన్ని సవరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News