Saturday, September 28, 2024

ICICI బ్యాంక్‌కు SEBI హెచ్చరిక..

- Advertisement -
- Advertisement -

దేశంలోని రెండో అతిపెద్ద ఐసీఐసీఐ బ్యాంక్‌కు స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఇటీవలహెచ్చరికలు జారీ చేసింది. కారణం.. ఐసిఐసిఐ సెక్యూరిటీస్‌కు చెందిన షేర్లను డీలిస్ట్ చేయడానికి ఓటు వేయమని వాటాదారులపై ఒత్తిడి తెచ్చేందుకు బ్యాంక్ ప్రయత్నించినందున బ్యాంకుకు ఈ హెచ్చరిక జారీ చేసింది. కాగా, స్టాక్ డీలిస్టింగ్ అంటే మార్కెట్ నుండి షేర్లను తొలగించడం అని అర్థం.

ఈ నేపథ్యంలో బ్యాంకు అధికారులు తమకు కాల్ చేయడం లేదా మెసేజ్‌లు పంపడం ద్వారా తమపై ఒత్తిడి తెచ్చారని పలువురు షేర్‌హోల్డర్ల నుంచి సెబీకి ఫిర్యాదులు అందాయి. అలాగే ఓటు వేసే విధానం స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేయాలని సూచించిందట. మార్చి చివరి నాటికి, ICIC సెక్యూరిటీస్ తన షేర్లను డీలిస్ట్ చేయడానికి అవసరమైన ఓట్లను పొందింది. కానీ, బ్యాంకు అధికారులు షేర్ హోల్డర్ల నుంచి ఓటింగ్ స్క్రీన్ షాట్ అడగడంపై సెబీ అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఈ మొత్తం విషయంలో..ఓటింగ్‌లో ఎక్కువ వాటాదారులను చేర్చడానికి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఐసిఐసి బ్యాంక్ తెలిపింది. సెబీ అభ్యర్థన మేరకు..బ్రోకరేజ్ వాటాదారుల డేటాను బ్యాంక్‌తో పంచుకుంది. డీలిస్టింగ్‌కు వ్యతిరేకంగా ఐసీఐసీ సెక్యూరిటీస్‌కు చెందిన కొందరు షేర్‌హోల్డర్లు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని ఎదుర్కోవడానికి ఈ పని చేసినట్లు బ్యాంక్ తెలిపింది.

మరోవైపు..ఈ మొత్తం ఇష్యూపై సెబీ మాట్లాడుతూ..ఈ విషయంలో బ్యాంక్ ప్రయోజనాల వైరుధ్యం ఉందని, ఎందుకంటే ICIC సెక్యూరిటీలలో బ్యాంక్ 74% కంటే ఎక్కువ షేర్లను కలిగి ఉంది. ఈ లావాదేవీలో ప్రత్యక్ష ప్రయోజనం కలిగి ఉంది. ఈ కారణంగా..సెబీ బ్యాంకు చేస్తున్న పనిని తప్పుగా పరిగణించింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న సెబీ బ్యాంకుకు హెచ్చరికలు జారీ చేసింది. కాగా, భవిష్యత్తులో ఇలాంటివి అస్సలు చేయవద్దని, ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా నియమాలను పాటించడంలో జాగ్రత్తగా ఉండాలని అన్నారు. అలా చేయకుంటే బ్యాంకుపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News