Wednesday, January 22, 2025

22న నాగర్‌కర్నూల్ జడ్‌పి చైర్మన్ ఎన్నిక

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్: నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి షెడ్యూల్ విడుదల చేశారు. తెలకపల్లి జడ్పిటిసి పద్మావతి తన ఎన్నికల అఫిడవిట్‌లో సంతానానికి సంబంధించి తప్పుడు వివరాలు సమర్పించినట్లు విచారణలో తేలడంతో హైకోర్టు ఆమెపై అనర్హత వేటు వేసింది. దీంతో జడ్పీ చైర్‌పర్సన్ పదవీ నుంచి ఆమె తప్పుకోవడంతో చైర్మన్ ఎన్నిక అనివార్యంగా మారింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ చైర్మన్ ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 15న నోటిఫికేషన్ జారీ చేసి.. ఈ నెల 22న ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికను చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచించింది.

ముగ్గురు పిల్లల కారణంగా వైదొలిగిన పద్మావతి…
తెలకపల్లి జెడ్పిటిసి పద్మావతి తన ఎన్నికల అఫిడవిట్లో సంతానానికి సంబంధించి తప్పు డు వివరాలు సమర్పించారని కాంగ్రెస్ అభ్యర్థి సుమిత్ర ఎన్నికల ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు.ఈ మేరకు విచారణ తర్వాత పద్మావతిని జడ్పిటిసి సభ్యత్వానికి అనర్హురాలిగా పేర్కొంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో రెండోస్థానంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి సుమిత్ర ఎన్నికైనట్లు ప్రకటించాలని ఆదేశించింది. దీంతో ఇటీవలే సుమిత్రతో జడ్పీ సిఈఓ ప్రమాణ స్వీకారం చేయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News