Saturday, November 23, 2024

నేడు కొలువుదీరనున్న జిహెచ్‌ఎంసి పాలక మండలి

- Advertisement -
- Advertisement -

 అన్ని ఏర్పాట్లు పూర్తి, ఉదయం 11 గంటలకు కార్పొరేటర్ల ప్రమాణస్వీకారం 

 మధ్యాహ్నం 12.30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు

 ఏర్పాట్లను సమీక్షించిన రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్

మన తెలంగాణ/సిటీ బ్యూరో : జిహెచ్‌ఎంసి నూతన పాలక మండలి ఏర్పాటుకు సర్వం సిద్దం చేశారు. ఎంతో కాలంగా అసక్తిగా ఎదురు చూస్తున్న కొత్తగా ఎన్నికైన బల్దియా కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారంతో పాటు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రక్రియ నేడు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి జిహెచ్‌ఎంసిలోని ప్రధాన కార్యాలయంలో అధికారులు అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. ఇందులో భాగంగా ముందుగా ఉదయం 11 గంటలకు కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు సమావేశం కానున్న సర్వసభ్య సమావేశంలో మేయర్, డిప్యూటీ మేయర్‌ను పదువులకు ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ ప్రత్యేక సమావేశాన్ని ప్రిసైండింగ్ అధికారి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేత మహంతి నిర్వహించనున్నారు. ఎన్నిక ప్రక్రియ పరిశీలన అధికారి, పంచాయితీ, గ్రామిణాభివృద్ది శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా సమావేశం జరగుతున్న తీరు తెన్నులను వేదికపై నుంచి పరిశీలిస్తారు. సమావేశం ముగిసిన తర్వాత ఇందుకు సంబంధించిన ప్రత్యేక నివేదికను ఎన్నికల సంఘానికి అందజేయనున్నారు. అదేవిధంగా సమావేశం మొత్తం ముగిసే వరకు పూర్తిగా వీడియో గ్రఫీ చేయనున్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన ఎన్నికల కమీషనర్…
గురువారం (నేడు) జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలోని నిర్వహించనున్న ప్రత్యేక సమావేశం ఏర్పాట్లను బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ సి. పార్థసారధి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కౌన్సిల్ హాల్‌లో నూతన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారంతో పాటు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలకు సంబంధించిన ఎక్స్ ఆఫీషియో, కార్పొరేటర్ల సిట్టింగ్ ఏర్పాట్లు, అధికారుల నియామకం, బందోబస్తు ఏర్పాట్లుపై ఉన్నతాధికారులతో సమిక్షించారు. ఈ సందర్భంగా పార్థసారధి మాట్లాడుతూ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలకు సంబంధించి నేడు జిహెచ్‌ఎంసి కార్యాలయంలో నిర్వహించనున్న సమావేశానికి ప్రిసైడింగ్ అధికారి శ్వేతమహంతి నిర్వహించనుండగా ఈ పక్రియను పరిశీలన అధికారి సీనియర్ ఐఎఎస్ అధికారి సందీప్ సుల్తానియా పరిశీలిస్తారని తెలిపారు. జిహెచ్‌ఎంసి కార్యాలయంలో నిర్వహించనున్న ఈ సమావేశానికి ఓటింగ్ హక్కు కల్గిన సభ్యులను సంబంధిత అధాకారులను ఎన్నికల అథారిటీ ద్వారా పాస్‌లు జారీ చేయబడిన మీడియా సభ్యుల ను మాత్రమే అనుమతిస్తారని వెల్లడించారు. సమావేశం సజావుగా నిర్వహించడానికి అర్హత కల్గిన ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశానికి తమ గుర్తింపు కార్డులను ధరించి అధికారులకు సహకరించాలని కోరారు. అదేవిధంగా నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు, గుర్తింపుకు గాను రిటర్నింగ్ అధికారి ద్వారా అందజేసిన ఎన్నిక ధృవీకరణ పత్రంతో పాటు ప్రిసైడింగ్ అధికారి జారీ చేసిన సమావేశం నోటీసుతో తీసుకుని ఉదయం 10.30 గంటల వరకు కౌన్సిల్ హాల్‌కు వద్దకు రావాల్సిందిగా కోరారు. దీంతో 11 గంటలకు ప్రమాణ స్వీకారం నిర్వహించడం సులభం అవుతుందని తెలిపారు. అదేవిధంగా నూతన కార్పొరేటర్లు ప్రమాణ స్వీకార పత్రాన్ని తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్ధూ భాషల్లో ఎదైనా ఎంచుకుని ముందుగానే చదువుకుని రిహార్సల్ చేసుకొంటే తమ ప్రమాణ స్వీకారంలో ఎలాంటి తప్పులు దొర్లకుండా కార్యక్రమం సజావుగా సాగుతుందని సూచించారు. తీసుకు రావాల్సిందిగా కోరారు. ఈ సమిక్ష సమావేశంలో ఎన్నికల పరిశీలన అధికారి సందీప్ సుల్తానియా, ప్రిసైడింగ్ అధికారి శ్వేత మహంతి, జిల్లా ఎన్నికల అధికారి జిహెచ్‌ఎంసి కమీషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్, పోలీసు శాఖ అదనపు కమీషనర్ డి.ఎస్.చౌహన్, జాయింట్ కమీషనర్ తరుణ్ జోషి, విశ్వప్రసాద్, జిహెచ్‌ఎంసి అదనపు కమీషనర్లు పంజ, జయరాజ్ కెనడి తదితరలు పాల్గొన్నారు.

SEC review on electing mayor on Feb 11

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News