నిందితుడు సుభాష్ శర్మకు మరణశిక్ష విధించిన సెషన్స్ కోర్టు మిగిలిన
ఆరుగురికి జీవితఖైదు ఒక్కొక్కరికి రూ.10వేల జరిమానా ఆరేళ్ల
తర్వాత నల్లగొండ ఎస్‌సి, ఎస్‌టి న్యాయస్థానం సంచలన తీర్పు భారీ
బందోబస్తు నడుమ జైలుకు దోషులు విచారణ సమయంలోనే
ఆత్మహత్యకు పాల్పడిన అమృత తండ్రి, ఎ1 మారుతీరావు మా నాన్న
నిర్దోషి, అన్యాయంగా బలి చేశారు నిందితుడు శ్రవణ్ కుమార్తె రోదన
మన తెలంగాణ/నల్గొండ బ్యూరో: నల్లగొండ జిల్లా, మిర్యాలగూడలో 2018 సెప్టెంబర్ 14వ జరిగిన ప్రణయ్ అనే యువకుడి హత్య కేసుకు సంబంధించి నల్లగొండ రెండో అదనపు సెషన్స్ ఎస్‌సి, ఎస్‌టి కోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృ ష్టించిన పరువు హత్య కేసులో ఏ2 నిందితుడికి ఉరిశిక్ష వేయగా, మిగిలిన ఆరుగురికి జీవిత జీ విత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. నిందితులందరికీ యావజ్జీవ శిక్షతో పాటు ఒక్కొక్కరికి పది వేల రూపాయల వంతున జరిమానా విధించిం ది. ప్రస్తుతం హైదరాబాద్‌లో హైడ్రా కమిషనర్, 2018లో నల్లగొండ ఎస్‌పి అయిన రంగనాథ్ పర్యవేక్షణలో ఈ కేసు దర్యాప్తు జరిగింది. ఈ కేసును దర్యాప్తు చేస్తూ సాక్ష్యాధారాలు సేకరించడంలో, నిందితులు ఎక్కడికీ పారిపోకుండా పో లీసులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు.
అంతే పకడ్బందీగా విచారణ చేపట్టారు. ప్రణయ్ హ త్య కేసులో ఏ1 మారుతీరావు, ఏ2 బిహార్‌కు చెందిన సుభాష్ శర్మ, ఏ3 అస్గర్ అలీ, ఏ4 అబ్దు ల్లా బారి, ఏ5 ఎంఎ కరీం, ఏ6 శ్రవణ్ కుమార్, ఏ7 శివ, ఏ8 నిజాంలను దోషులుగా కోర్టు గు ర్తించి తుది తీర్పు ప్రకటించింది. ఈ కేసు విచారణ కొనసాగుతున్న సమయంలోనే ప్రధాన నిం దితుడు, అమృత తండ్రి మారుతీరావు బెయిల్‌పై బయటకు వచ్చినా మానసికంగా ఒత్తిడికి గురై 2020 మార్చి 7న హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఆర్య సమాజ్ భవన్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసుకు సంబంధించి నిందితులం తా 2019లో బెయిల్ పై విడుదలయ్యారు. ప్ర ణయ్ హత్యపై అప్పటి ఎస్‌పి రంగనాథ్ 1600 వందల పేజీల ఛార్జిషీట్ నమోదు చేశారు. ఈ కేసులో ఎ2 సుభాష్ శర్మ, ఎ3 అస్గర్ అలీ విచారణ ఖైదీలుగా ఉన్నారు. మిగిలిన ఐదుగురు నిందితులు బెయిల్ పై విడుదలై కోర్టు విచారణకు హాజరయ్యారు. తీర్పు వెలువడిన తర్వాత భారీ బందోబస్తుతో దోషులందర్నీ జైలుకు తరలించారు.
హత్యకు దారితీసిన ఘటన పూర్వాపరాలు…
నల్లగొండ జిల్లా, మిర్యాలగూడలో 2018లో ప్రణయ్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ఇది పరువు హత్య కావడంతో అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. మిర్యాలగూడకు చెందిన మారుతీరావు కూతురు అమృత, అదే గ్రామానికి చెందిన ప్రణయ్ పాఠశాల వయస్సు నుంచి ప్రేమించుకున్నారు. 2018లో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. తన కుమార్తె కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో ఆమె తండ్రి మారుతీరావు సుపారీ గ్యాంగ్‌తో 2018 సెప్టెంబర్ 14వ తేదీన ప్రణయ్‌ని హత్య చేయించాడు. మృతుడు ప్రణయ్ తండ్రి బాలస్వామి ఇచ్చిన ఫిర్యాదుతో 8 మందిపై 302 ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు, ఆర్మ్ యాక్ట్ సెక్షన్ల కింద మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
మా నాన్నకు అన్యాయంగా శిక్ష విధించారు
ఏ 6 నిందితుడు శ్రవణ్ కుమార్తె స్ఫూర్తి ఆత్మహత్యాయత్నం
తమ నాన్నకు అన్యాయంగా శిక్ష విధించారని ప్రణయ్ హత్య కేసులో ఏ 6 నిందితుడిగా ఉన్న తిరునగర్ శ్రవణ్ కుమార్తె స్ఫూర్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సోమవారం తీర్పు ఉండడంతో ఆమె తల్లితోపాటు కోర్టు వద్దకు వచ్చింది. కోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఆమె పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నం చేసింది. చుట్టూ ఉన్నవారు ఆమె ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ’ఈ కేసులో ప్రథమ ముద్దాయిగా ఉన్న తిరునగరు మారుతీ రావు సోదరుడే శ్రవణ్ అని, తమ పెదనాన్న చేసిన తప్పునకు తమ నాన్నను అన్యాయంగా బలిచేశారని, ఆయన ఎలాంటి తప్పు చేయలేదని శ్రవణ్ కుమార్తె స్ఫూర్తి రోదించింది. మీడియా అతి ప్రచారం వల్లే అమాయకుడైన తన తండ్రి దోషిగా నిలబడాల్సిన పరిస్థితి తలెత్తిందని ఆరోపించింది.