Wednesday, April 16, 2025

మద్యం మత్తులో డ్రైవింగ్.. బాలుడి ప్రాణం తీశాడు..

- Advertisement -
- Advertisement -

వరంగల్: మద్యం మత్తులో ఓ టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ఓ బాలుడి ప్రాణాలను బలిగొన్నాడు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పూల్లయ్యబోడుతండాలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తండాకు చెందిన వెంకన్న, జ్యోతి దంపతుల కుమారుడు స్కూల్‌లో రెండో తరగతి చదువుతున్నాడు. స్కూల్‌కి వెళ్లి వచ్చిన ఆ పిల్లాడు కొంత సమయం ఇంటి వద్ద ఆడుకున్నాడు.

ఆ తర్వాత చాక్లెట్ కోసం.. పక్కనే ఉన్న దుకాణంకి వెళ్లాడు. ఆ సమయంలో వేగంగా వచ్చిన టిప్పర్ అతన్ని ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. స్థానికులు డ్రైవర్‌ని పట్టుకొని అతనిపై దాడి చేశారు. ఘటనస్థలి చేరుకున్న పోలీసులు గాయపడిన డ్రైవర్‌ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News