Sunday, December 22, 2024

235 మంది భారతీయులతో ఇజ్రాయెల్ నుంచి రెండో విమానం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఆపరేషన్ అజయ్‌లో భాగంగా ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ నుంచి 235 మంది భారతీయులతో రెండడవ విమానం శనివారం ఉదయం న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుంది. ఇజ్రాయెల్ నుంచి తరలించిన భారతీయులకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రాజ్‌కుమార్ రంజన్ సింగ్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు.

ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంలో చిక్కుకున్న భారతీయులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తమ స్వదేశానికి చేరుకున్నారు. తమ కుటుంబ సభ్యులను, ఆప్తులను చూసి వారంతా కన్నీరు పెట్టుకున్న దృశ్యాలు విమానాశ్రయంలో కనిపించాయి. యుద్ధం కారణంగా షెల్టర్లలో తలదాచుకున్న భారతీయులను భారత ప్రభుత్వం ఆపరేషన్ అజయ్ పేరిట అక్కడ నుంచి స్వదేశానికి తరలించే ఏర్పాటు చేపట్టింది. శుక్రవారం ఉదయం భారతీయులతో మొదటి విమానం ఇజ్రాయెల్ నుంచి న్యూఢిల్లీ రాగా రెండవ విమానం మరుసటి రోజు వచ్చింది. వీరిలో చాలామంది అక్కడ చదువుకుంటున్న విద్యార్థులు, పరిశోధకులు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News