Thursday, January 23, 2025

సెకండ్ హ్యాండ్ ఫోన్ కొంటున్నారా?..ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!

- Advertisement -
- Advertisement -

కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారు బడ్జెట్ ఉంటె వెంటనే ఫోన్‌ను కొనుగోలు చేస్తారు. కానీ, సెకండ్ హ్యాండ్ ఫోన్‌ విషయం లో ఆలా కాదు. తక్కువ ధరకే పొందాలని చూస్తుంటారు. ఇలా సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనే సమయంలో చాలా మంది చేసే కొన్ని పొరపాట్లు, డబ్బు ఆదా చేసే క్రమంలో కూడా నష్టాల పాలవుతున్నారు. అయితే, సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలను ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

బిల్లును తనిఖీ చేయుట

సెకండ్ హ్యాండ్ ఫోన్స్ తక్కువ ధరకు లభిస్తాయని చాలా మంది OLX వంటి వెబ్‌సైట్‌ల నుండి స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. కానీ, ఇక్కడ వారిని గుడ్డిగా నమ్మకూడదు. మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సందర్భంలో అటువంటి సైట్ల నుండి ఫోన్‌ను కొనుగోలు చేసే ముందు, మీరు తప్పనిసరిగా స్మార్ట్‌ఫోన్ బిల్లును తనిఖీ చేయాలి.

పనితీరు, డిజైన్

కొనుగోలు చేస్తున్న ఫోన్ పనితీరు ఎలా ఉంది. ఏ చిప్‌సెట్ ఇందులో ఇవ్వబడింది. ఇలా అనేక విషయాలన్నీ కూడా చూడాలి. ఫోన్ కోసం అతి ముఖ్యమైనది ప్రాసెసర్. అది మరచిపోకుండా అడిగి తెలుసుకోవాలి. మీరు పాత చిప్‌సెట్‌లో పనిచేసే ఫోన్‌ను కొనుగోలు చేస్తే.. మంచి పనితీరును ఉన్న ఫోన్ పొందలేరు. ఇది కాకుండా ఫోన్ నిర్మాణ నాణ్యతను కూడా తనిఖీ చేయాలి.

IMEI సంఖ్య తనిఖీ

సెకండ్ హ్యాండ్ లేదా కొత్త స్మార్ట్‌ఫోన్ కు IMEI నంబర్ ఉండడం చాలా ముఖ్యం. అందువల్ల ఈ అవసరమైన నంబర్‌ను సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనుగోలు చేయడానికి ముందు తనిఖీ చేయాలి. దీంతో మీరు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఫోన్ పోయిన సందర్భంలో అదే సంఖ్య చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News