- Advertisement -
రెండో విడత రుణమాఫీ విధులను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేయనుంది. ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు అసెంబ్లీ ఆవరణలో రెండో విడత రుణమాఫీని సిఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు.
ఈ కార్యక్రమానికి డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరుకానున్నారు. ఈ విడతలో లక్షన్నర రుపాయల వరకు రుణాల మాఫీని చేయనుంది ప్రభుత్వం. దాదాపు 7 లక్షల మంది రైతులకు ₹7వేల కోట్ల మేర లబ్ధి చేకూరనుంది.
ఇక, తొలి విడతలో లక్ష రూపాయల లోపు దాదాపు 11.50 లక్షల మంది రుణాలను సర్కార్ మాఫీ చేసింది. ఇందుకోసం ₹6,035 కోట్లు ఖర్చు చేసింది.
- Advertisement -