Monday, December 23, 2024

గురుకుల కాలేజీల్లో ప్రవేశాలకు రెండో జాబితా విడుదల

- Advertisement -
- Advertisement -

Second list for admissions in gurukula colleges has been released

మన తెలంగాణ / హైదరాబాద్ : సాంఘీక సంక్షేమ గురుకుల జూనియర్ కాలేజీలో మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు రెండో జాబితాను విడుదల చేశారు. మొదటి సంవత్సరంలో జనరల్ ఒకేషనల్ కోర్సుల్లో చేరేందుకు ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 3వ తేదీ నుండి 8వ తేదీలోగా తమకు కేటాయించిన కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని టిఎస్‌డబ్లుఆర్‌జెసి సెట్ కన్వీనర్ రోనాల్డ్ రాస్ సూచించారు. కుల ధృవీకరణ, సెలక్షన్ కాపి, టిసి, ఆదాయ ధృవీకరణ, మార్కుల మెమో, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోగ్రాఫ్‌తో తమకు కేటాయించిన కాలేజీల్లో రిపోర్ట్ చేసి ప్రవేశ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. గడవులోగా చేరకపోతే వారికి కేటాయించిన సీటును రద్దు చేయడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 45678 లకు సంప్రదించాలన్నారు. అభ్యర్థులు www.tswrjc.cgg.gov.in, www.tswreis.ac.in వెబ్‌సైట్‌లను కూడ సందర్శించవచ్చని సూచించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News