Thursday, November 14, 2024

ఇండియన్ల అమెరికా కలకు మరో ఛాన్స్

- Advertisement -
- Advertisement -
Second lottery of H-1B visa applicants
హెచ్ 1 బి వీసాలపై రెండోసారి లాటరీ

వాషింగ్టన్: అమెరికా హెచ్ 1 బి వీసా కలల భారతీయ యువతకు మరో మంచి అవకాశం వచ్చింది. అత్యంత అరుదైన పరిణామంగా ఈ వీసాలకు సంబంధించి రెండో లాటరీ తీయాలని అమెరికా సిటిజన్‌షిప్ అంట్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్‌సిఐఎస్) తెలిపింది. ఈ ఏడాది ర్యాండమ్ ఎంపికలో ఈ వీసాలు దొరకని వారికి ఈ లాటరీ విధానం ద్వారా వీసాలు దక్కే వీలుంది. ఈ ఏడాది మొదట్లో నిర్వహించిన కంప్యూటరైజ్డ్ డ్రాలో సరియైన సంఖ్యలో వీసాలు జారీ కాలేదు. దీనితో తిరిగి లాటరీ ప్రక్రియ చేపడుతారు. ఉద్యోగావకాశాలకు గ్రీన్ సిగ్నల్ కల్పించే ఈ వీసాల కోసం వందలాది మంది భారతీయులు ఎదురుచూస్తున్నారు. ట్రంప్ హయాంలో బ్రేకులు పడ్డ హెచ్ 1 బి వీసాల జారీ విషయంలో బైడెన్ రాకడతో తిరిగి చిగురు తొడిగిన పరిస్థితి నెలకొంది. బైడెన్ అధికార యంత్రాంగం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని రెండో డ్రా నిర్వహణకు నిర్ణయం తీసుకున్నట్లు యుఎస్ ఇమిగ్రేషన్ విభాగం తెలిపింది.

అమెరికా కంపెనీలు విదేశీయులను, ప్రత్యేకించి భారతీయ ఐటి యువతను ఉద్యోగాలలోకి తీసుకునే అత్యంత కీలకమైన వృత్తి నైపుణ్య ప్రాతిపదిక ఉద్యోగ కల్పనల వీసాలుగా హెచ్ 1 బి వీసాలు గుర్తింపు పొందాయి. ఇప్పటికే అందిన లేదా రికార్డు అయిన వీసా ఎలక్ట్రానిక్ లేదా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌లను ర్యాండమ్ పద్థతిలో ఎంపిక చేశారు. ఈ విధంగా ఎంపిక అయిన రిజిస్ట్రేషన్లకు సంబంధించి పిటిషన్ దాఖలు గడువు ఆగస్టు రెండున ఆరంభం అయ్యి, నవంబర్ 3తో ముగుస్తుంది. హెచ్ 1 బి వీసాదరఖాస్తుదారులలో మరింత మందికి అవకాశం కల్పించేందుకు రెండోసారి లాటరీ ఉంటుంది. 2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిజిస్ట్రేషన్లు చేసుకున్నవారికే సంబంధిత లాటరీలో చేరుస్తారు. దరఖాస్తుదారులు ఈ రెండో అవకాశపు లాటరీకి అర్హతను తెలియచేసుకోవడం కేవలం లిఖితపూర్వకంగా సంబంధిత అధికారుల సమక్షంలో చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఆన్‌లైన్ ప్రక్రియకు అవకాశం ఉండదు. ట్రంప్ ముందటి వరకూ ఈ వీసాల జారీలో లాటరీ విధానం అమలులో ఉండేది. బైడెన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ సంప్రదాయక లాటరీ విధానం కొనసాగింపు నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఏటా అమెరికాలో 85000 హెచ్ 1 బి వీసాలు జారీ అవుతున్నాయి. దీనితో చైనీయులకు, ఇండియన్లకు ఐటి సంస్థలు ఎక్కువగా ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. విదేశీయులకు సంబంధించి జారీ అయ్యే 65 వేల వీసాలను పొందిన వారు అక్టోబర్ 1 నుంచి ఉద్యోగాలలో చేరేందుకు వీలుంటుంది.

Second lottery of H-1B visa applicants

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News