Monday, December 23, 2024

వర్షం కారణంగా రెండో వన్డే రద్దు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : భారత్ కివీస్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. మ్యాచ్ మొదలైనప్పటి నుంచి వర్షం అంతరాయం కలిగిస్తూనే ఉంది. టీమిండియా ఇన్నింగ్స్ 12.5 ఓవర్ల వద్ద భారీగా వర్షం కురవడంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాదని అంపైర్లు నిర్ణయించారు.

దీంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మ్యాచ్ రద్దు చేసే సమయానికి ఇండియా 12.5 ఓవర్లలో 89/1 స్కోరుతో నిలిచింది. మూడు వన్డేల సిరీస్ లలో కివీస్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో నవంబర్ 30న జరిగే చివరి వన్డే కీలకం కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News