Sunday, December 22, 2024

సవాల్ వంటిదే..

- Advertisement -
- Advertisement -

వరుస ఓటములతో సతమతమవుతున్న వెస్టిండీస్ టీమ్‌కు భారత్‌తో రెండో వన్డే సవాల్‌గా తయారైంది. కిందటి మ్యాచ్‌లో విండీస్ 114 పరుగులకే కుప్పకూలింది. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా మెరుగైన ప్రదర్శన చేస్తుందా లేదా అనేది సందేహమే. తొలి వన్డేలో కెప్టెన్ షాయ్ హోప్ ఒక్కడే కాస్త పోరాటం చేశాడు. ఓపెనర్లు కింగ్, మేయర్స్‌లతో పాటు అలిక్, హెట్‌మెయిర్, రొమాన్ పొవెల్ తదితరులు విఫలమయ్యారు. కీలకమైన ఈ మ్యాచ్ అయినా వీరు తమ బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ మ్యాచ్‌లో ఓడితే సిరీస్ కోల్పోవడం ఖాయం. దీంతో దీనిలో ఎలాగైనా గెలిచి సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని విండీస్ భావిస్తోంది. ఇందులో ఎంతవరకు సఫలం అవుతుందో వేచి చూడాల్సిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News