- Advertisement -
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాలలో గురువారం ఉదయం రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల వద్దకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పశ్చిమ బెంగాల్‌లో 30 స్థానాల్లో పోలింగ్ జరుగుతుండగా దాదాపుగా 76 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 171 మంది అభ్యర్థులు ఈ స్థానాలలో పోటీ చేస్తున్నారు. అసోంలో రెండో దశ పోలింగ్‌లో 39 స్థానాలలో 73.44 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 345 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బెంగాల్, అసోంలో అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్‌లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.
- Advertisement -