Friday, November 22, 2024

నేటి నుంచే ఐపిఎల్ సంరంభం

- Advertisement -
- Advertisement -

Second phase of IPL season 14 starts tomorrow

ఐపిఎల్‌కు భారీ ఏర్పాట్లు

దుబాయి: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఐపిఎల్ సీజన్14 రెండో దశ మ్యాచ్‌లకు ఆదివారం తెరలేవనుంది. నిజానికి ఈ ఏడాది ఏప్రిల్‌మే నెలల్లోనే ఐపిఎల్ టోర్నమెంట్ పూర్తి కావాల్సి ఉంది. అయితే కరోనా కేసుల కారణంగా టోర్నీని అర్ధాంతరంగా వాయిదా వేయాల్సి వచ్చింది. ఇక మిగిలిన రెండో దశ మ్యాచ్‌లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) వేదికగా నిర్వహించాలని భారత క్రికెట్ బోర్డు నిర్ణయించింది. ఇక యుఎఇలోని దుబాయి, షార్జా, అబుదాబి స్టేడియాల్లో ఐపిఎల్ రెండో దశ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఆదివారం ముంబై ఇండియన్స్‌చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో టోర్నీ రెండో దశ ఆరంభమవుతోంది. ఇక ఫైనల్ సమరం అక్టోబర్ 15న జరుగుతుంది. తొలి దశ ముగిసే సమయానికి ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు విజయాలతో అగ్రస్థానంలో నిలిచింది.

మాజీ విజేత చెన్నై సూపర్ కింగ్స్ రెండో, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. డిఫెండింగ్ చాంపియన్ ముంబై నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇక హైదరాబాద్‌కు చెందిన సన్‌రైజర్స్ కేవలం ఒకే ఒక విజయంతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పరిమితమైంది. ఇక ఈ టోర్నమెంట్‌లో పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ వరుస విజయాలతో అగ్రస్థానంలో నిలవడం విశేషం. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన ఢిల్లీ అనూహ్యంగా టాప్‌కు చేరుకుంది. కాగా రెండో దశ మ్యాచ్‌లు అన్ని జట్లకు కీలకంగా మారాయి. ప్రస్తుత ఉన్న పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే ఢిల్లీ, చెన్నైలు ఎలాంటి ఆటంకం లేకుండా నాకౌట్ దశకు చేరుకునే అవకాశాలున్నాయి. మరోవైపు ముంబై, బెంగళూరుకు కూడా ఆశలు సజీవంగానే ఉన్నాయి. కానీ, హైదరాబాద్, రాజస్థాన్, పంజాబ్, కోల్‌కతా జట్లకు ప్లేఆఫ్ అవకాశాలు చాలా క్లిష్టంగా మారాయి. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప హైదరాబాద్, కోల్‌కతా, పంజాబ్ జట్లు నాకౌట్‌కు అర్హత సాధించడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది.

భారీ ఏర్పాట్లు..

మరోవైపు ఐపిఎల్ కోసం యుఎఇ క్రికెట్ బోర్డు భారీ ఏర్పాట్లు చేసింది. ఆటగాళ్లు, సహాయక సిబ్బంది ఆరోగ్య భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. టోర్నమెంట్ సందర్భంగా పలు కఠినమైన నిబంధనలను అమలు చేయనున్నారు. ఆటగాళ్లతో పాటు సహాయక సిబ్బందికి తరచు కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. అంతేగాక నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలకు సయితం వెనుకాడబోమని యుఎఇ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. ఇక ఈసారి ఐపిఎల్‌లో పరిమిత సంఖ్యలో అభిమానులకు ప్రవేశం కల్పిస్తున్నారు. కరోనా నియమ నిబంధనలకు లోబడి ప్రేక్షకులకు మ్యాచ్‌లను చూసేందుకు అనుమతి ఇస్తారు. ఇక మ్యాచ్‌లను చూసే వారికి పలు కఠిన నిబంధనలను ఉంచారు. అందులో సఫలమైన వారికి మాత్రమే మ్యాచ్‌లను చూసే అవకాశం దక్కుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News