Monday, December 23, 2024

రూ.250 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం : మంత్రి హరీశ్ రావు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట : కంటి వెలుగు విజయవంతానికి అధికారులు, ప్రజా ప్రజాప్రతినిధులకు మంత్రి హరీష్ దిశానిర్దేశం చేశారు. సిద్ధిపేట కలెక్టరేట్ లో కంటి వెలుగు కార్యక్రమం పై ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు పాల్గొని మాట్లాడుతూ రూ.250 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

ఈ నెల 18న ఖమ్మంలో సిఎం కెసిఆర్‌ కంటి వెలుగు రెండో విడతను ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఎవరూ దృష్టి లోపంతో బాధపడకూడదన్న లక్ష్యంతో కంటి వెలుగు చేపట్టమని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,500 బృందాలు 100 రోజుల పాటు పనిచేస్తాయని సూచించారు. జనవరి 18 నుంచి ప్రతీ రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కంటి వెలుగు క్యాంపులు పనిచేస్తాయని ప్రతి ఒక్కరు కంటి వెలుగు కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని మంత్రి తెలిపారు.

ప్రతి క్యాంపులో మెడికల్‌ ఆఫీసర్‌, అప్తామాలజిస్టు, ఇద్దరు ఏఎన్‌ఎంలు, ముగ్గురు ఆశా వర్కర్లు, డాటాఎంట్రీ ఆపరేటర్‌ ఉంటారని, సిబ్బందికి పూర్తిగా ఆన్‌లైన్‌ స్ర్కీనింగ్‌, కంప్యూటరైజ్డ్‌ కంటి పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. సిబ్బందికి వసతి, భోజనం సౌకర్యాల కోసం రోజుకు రూ.1500లు. క్యాంపు దగ్గర షామియానా, మంచినీరు, కుర్చీలు, టేబుల్‌ ఏర్పాటుకు రోజుకు రూ.1000 చొప్పున పంచాయితీలు, మున్సిపాలిటీలకు నిధులు విడుదల చేస్తామని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News