Saturday, December 21, 2024

రెండో విడత కంటివెలుగు కార్యక్రమం ప్రారంభం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత కంటివెలుగు కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. హైదరాబాద్ అమీర్ పేట లోని వివేకానందా కమ్యూనిటీ హాల్ లో మంత్రులు తన్నీరు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. 18 ఏళ్లు పైబడిన అందరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేయనున్నారు. శిబిరాలు ఏర్పాటు చేసిన కంటి పరీక్షలు చేయనున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. శని, ఆదివారాలు, సెలవుదినాలు మినహా అన్ని రోజుల్లో కంటి పరీక్షలు అందుబాటులో ఉంటాయి. కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి కళ్లద్దాలు, మందులు పంపిణీ చేయనున్నారు.

అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేయించేందుకు రాష్ట్ర్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 100 రోజుల పాటు కంటివెలుగు కార్యక్రమం కొనసాగనుంది. వంద రోజుల్లో కోటిన్నర మందికి పరీక్షలు చేయాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1500 బృందాలు సేవలు అందించనున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిసి 16556 చోట్ల శిబిరాలను ఏర్పాటు చేశారు. కంటి పరీక్షలకు వెళ్లేవారు ఆధార్, రేషన్ కార్డు తీసుకెళ్లాలని అధికారులు సూచించారు. ఏఎన్ఎంలు ఇంటింటికి వెళ్లి కంటివెలుగు స్లిప్పులు పంపిణీ చేయనున్నారు. వ్యక్తి వివరాలు, టెస్టుకు వెళ్లాల్సిన ప్రాంతం, సమయంతో స్లిప్పుల పంపిణీ చేయనున్నారు. ఒక్కో కేంద్రంలో రోజుకు 120 మందికి పరీక్షలు చేసే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News