Wednesday, January 22, 2025

ఝార్ఖండ్‌లో న్యాయ్ యాత్ర రెండో దశ రద్దు

- Advertisement -
- Advertisement -

రాంచీ : ఝార్ఖండ్‌లో బుధవారం ప్రారంభం కావలసిన రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ రెండవ దశ రద్దు అయిందని కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. యాత్ర లోగడ ప్రకటించినట్లుగా గురువారం బీహార్‌లోని ఔరంగాబాద్‌లో తిరిగి ప్రారంభం అవుతుంది. దేశ రాజధానిలో రైతుల ఆందోళనలో పాల్గొనేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత ఢిల్లీకి హుటాహుటిని వెళ్లినందున ఝార్ఖండ్ యాత్ర రెండవ దశను రద్దు చేయవలసి వచ్చిందని పార్టీ వర్గాలు వివరించాయి.

యాత్ర ఛత్తీస్‌గఢ్ నుంచి గఢ్వా జిల్లా ద్వారా ఝార్ఖండ్‌లో బుధవారం తిరిగి ప్రారంభం కావలసి ఉంది. అయితే, గఢ్వా జిల్లా రాంకాలో ఎంజిఎన్‌రెగా కార్మికులతో ముందుగా నిర్ణయించిన ఇష్టాగోష్ఠిని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్, ఇతర పార్టీ నాయకులు నిర్వహించారు. ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర గురువారం బీహార్‌లోని ఔరంగాబాద్‌లో తిరిగి మొదలవుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఔరంగాబాద్‌లో బహిరంగ సభ జరుగుతుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ ప్రసంగిస్తారు’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జి) జైరామ్ రమేష్ బుధవారం గఢ్వాలో విలేకరులతో చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News