Monday, January 20, 2025

కొనసాగుతున్న గుజరాత్ అసెంబ్లీ రెండో దశ ఎన్నికలు

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ రెండో దశ ఎన్నికలు నేడు ఉదయం నుంచి కొనసాగుతున్నాయి. పోలింగ్ సాయంత్రం 6.30 గంటల వరకు కొనసాగనున్నది. గుజరాత్ ఉత్తర, మధ్యప్రాంతంలోని 14 జిల్లాల వ్యాప్తంగా 93 అసెంబ్లీ స్థానాలకు నేడు ఓటింగ్ జరుగుతోంది. పోటీ ప్రధానంగా బిజెపి, కాంగ్రెస్, ఆప్ పార్టీల మధ్య త్రిముఖ పోటీగా కనబడుతోంది. ఇక వివరాల్లోకి వెలితే… ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఉదయమే తమ ఓటు వినియోగించుకున్నారు. హోం మంత్రి అమిత్ షా సైతం తన ఓటు హక్కును అహ్మదాబాద్‌లో వినియోగించుకున్నారు. ఎగ్జిట్ పోల్స్ కథనాలు సాయంత్రం 6.30 తర్వాత మొదలవుతాయి.

అహ్మదాబాద్‌లోని జమాల్‌పూర్ ఖాడియాలో ముస్లింలకు పట్టుంది. అక్కడ అసదుద్దీన్ ఓవైసికి చెందిన మజ్లీస్ పార్టీ కాంగ్రెస్‌ను దెబ్బతీసే అవకాశం ఉంది. మజ్లీస్ పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీచేస్తున్న సబీర్ కబ్లీవాలా కాంగ్రెస్‌కు ఓట్లు తగ్గించేయొచ్చు. బిజెపి, ఆప్ మొత్తం 93 స్థానాలకు పోటీపడుతున్నాయి. కాగా కాంగ్రెస్ 90 సీట్లకు పోటీపడుతోంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సిపి) రెండు స్థానాలకు పోటీపడుతోంది.

అహ్మదాబాద్‌లోని ఘట్లోడియా నుంచి ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, అహ్మదాబాద్‌లెఓని విరంగం నుంచి పటీదార్ నాయకుడు హార్దీక్ పటేల్ పోటీపడుతున్నారు. బిజెపి అభ్యర్థిగా అల్పేశ్ ఠాకుర్ దక్షిణ గాంధీనగర్ నుంచి పోటీపడుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా దళిత నాయకుడు జిగ్నేశ్ మేవాని బనస్‌కాంత జిల్లాలోని వడగం నుంచి పోటీపడుతున్నారు. గుజరాత్‌లో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న సుఖ్‌రామ్ రథ్వా కాంగ్రెస్ నామినీగా చోటా ఉదేపూర్ జిల్లాలోని జెట్‌పూర్ నుంచి పోటీ చేస్తున్నారు. రెండో దశ ఎన్నికల్లో దాదాపు 2.51 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News